Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలునల్గొండరాజకీయం

తాళ్ళకుంటలో డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరణ..!

నల్గొండ జిల్లా కేతపల్లి మండలం ఇప్పలగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని తాళ్ళకుంట గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ నిర్మాత, సామాజిక న్యాయ పోరాట యోధుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రభుత్వ విప్ నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం శనివారం ఘనంగా ఆవిష్కరించారు.

తాళ్ళకుంటలో డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరణ..!

ఆవిష్కరించిన ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం.

కేతేపల్లి,  మనసాక్షి.

నల్గొండ జిల్లా కేతపల్లి మండలం ఇప్పలగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని తాళ్ళకుంట గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ నిర్మాత, సామాజిక న్యాయ పోరాట యోధుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రభుత్వ విప్ నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం శనివారం ఘనంగా ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ రచించిన భారత రాజ్యాంగం దేశ ప్రజలకు సమాన హక్కులు కల్పించిందని, అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు.
సమాజంలో ప్రతి ఒక్కరూ విద్యను ఆయుధంగా చేసుకుని ముందుకు సాగాలని, యువత అంబేడ్కర్ ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

అంబేడ్కర్ ఆశయ సాధనకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, సామాజిక న్యాయం, సమాన అవకాశాల కోసం ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నకిరేకల్ మార్కెట్ చైర్మన్ గుత్తా మంజుల, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు