Suryapet : పోలీసు శాఖలో సంచలన నిర్ణయం.. సూర్యాపేట జిల్లా అర్వపల్లి ఎస్సై సస్పెండ్..!
సూర్యాపేట జిల్లా అర్వపల్లి పోలీస్ స్టేషన్ కు చెందిన ఎస్సై ఈట సైదులను విధుల్లో నిర్లక్ష్యం, పోలీస్ స్టేషన్ రికార్డుల నిర్వహణలో లోపాలు ఫిర్యాదులు స్వీకరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఫోక్సో కేసులో అవినీతి ఆరోపణలు రావడంతో విచారణ చేసిన అధికారులు సస్పెండ్ చేసినట్లు సమాచారం.

Suryapet : పోలీసు శాఖలో సంచలన నిర్ణయం.. సూర్యాపేట జిల్లా అర్వపల్లి ఎస్సై
సస్పెండ్..!
అర్వపల్లి, మన సాక్షి :
సూర్యాపేట జిల్లా అర్వపల్లి పోలీస్ స్టేషన్ కు చెందిన ఎస్సై ఈట సైదులను విధుల్లో నిర్లక్ష్యం, పోలీస్ స్టేషన్ రికార్డుల నిర్వహణలో లోపాలు ఫిర్యాదులు స్వీకరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఫోక్సో కేసులో అవినీతి ఆరోపణలు రావడంతో విచారణ చేసిన అధికారులు సస్పెండ్ చేసినట్లు సమాచారం.
మల్టీ జోన్ 2 ఐజి శాల వాజ్ కాసిం, బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసినట్లు, సమాచారం. ఇటీవల కాలంలో మండల పోలీస్ స్టేషన్ను సూర్యాపేట ఎస్పీ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డుల నిర్వహణ సక్రమంగా లేనట్లు గుర్తించారు. ఎస్సైగా పోలీస్ స్టేషన్లో విధుల్లో చేరినప్పటి నుండి అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు.
స్టేషన్ లోనే నిద్రపోతున్నట్టు కొన్ని వార్త పత్రికలు మీడియా ఛానళ్లు, అనేకసార్లు ప్రసారం చేశాయి. గతంలో ఉన్న ఫిర్యాదులను, ప్రస్తుత ఫిర్యాదులను అన్నిటిపై విచారణ జరిపి పై అధికారుల సూచన మేరకు సస్పెన్షన్ విధించినట్లు తెలిసింది. పూర్తి సమాచారం అధికారికంగా వెలబడవలసింది.