Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Breaking : మిర్యాలగూడలో భారీ వర్షం..!

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో భారీ వర్షం కురుస్తోంది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి.

Breaking : మిర్యాలగూడలో భారీ వర్షం..!

మిర్యాలగూడ, మన సాక్షి :

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో భారీ వర్షం కురుస్తోంది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. సాగర్ రోడ్డు, ఖమ్మం రోడ్డు, నల్గొండ రోడ్డు పై వర్షం నీరు నిలవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. పట్టణంలోని పలు కాలనీలలో రోడ్లపై నీరు నిలవడంతో పాటు లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. పలు చోట్ల చెట్ల కొమ్మలు విరిగి పడ్డాయి. భారీ వర్షంతో మిర్యాలగూడ పట్టణంలో కురవడంతో పట్టణమంతా ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది.

వేములపల్లి లో :

నల్లగొండ జిల్లా వేములపల్లి మండలంలోని రావులపెంట, మొల్కపట్నం, పలు గ్రామంలో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులు,ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసిన నేపథ్యంలో… రోడ్లన్నీ జలమయ మయ్యాయి. దీంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది.వర్షపు నీరు ప్రభావంతో డ్రైనేజీలు నిండుకుండలా ప్రవహించాయి.

మరిన్ని వార్తలు