Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలువిద్యసూర్యాపేట జిల్లా

Suryapet : వికాస్ ఫార్మసీ కాలేజీలో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే సంబరాలు..!

భారతదేశానికి ఫార్మసీ రంగ ఎగుమతులే ఆర్థిక రంగానికి వెన్నుముక లాగా నిలబడ్డాయని న్యూ హైట్ ఫార్మా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరక్టర్ వి. వెంకటేశ్వర్లు అన్నారు.

Suryapet : వికాస్ ఫార్మసీ కాలేజీలో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే సంబరాలు..!

సూర్యాపేట, మనసాక్షి

భారతదేశానికి ఫార్మసీ రంగ ఎగుమతులే ఆర్థిక రంగానికి వెన్నుముక లాగా నిలబడ్డాయని న్యూ హైట్ ఫార్మా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరక్టర్ వి. వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం వికాస్ కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ ప్రాంగణం లో బి.ఫార్మాసీ, ఫార్మా.డీ విద్యార్థుల “గ్రాడ్యుయేషన్ డే ” కన్నుల పండుగగా జరిగింది.

ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో ఏర్పాటైనా కూడా వికాస్ ఫార్మసీ కళాశాల నుండి అత్యుత్తమ విద్యార్థులు మంచి ఫలితాలు సాధించి అగ్ర భాగాన నిలబడ్డారని అభినందించారు.

ఈ సందర్భంగా విశిష్ట అతిథిగా హాజరైన జన్ రైజ్ ఔషద పరిశోధనా సంస్థ ప్రధాన నిర్వహణా అధికారి డాక్టర్ తుకారాం బాపూజీ మాట్లాడుతూ ఫార్మసీ విద్యార్థులకు నిరుద్యోగ సమస్య ఉండదని అన్నారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థులకు వెనువెంటనే ఉద్యోగాలు లభిస్తాయని అన్నారు.

కార్యక్రమంలో రాష్ర్ట ఫార్మసీ కళాశాలల యాజమాన్యాల గౌరవ అధ్యక్షులు డాక్టర్ కె. రామదాసు మాట్లాడుతూ తెలంగాణ లోని 125 ఫార్మసీ కళాశాలల నుండి ఏటా పదివేల మంది విద్యార్థులు బి.ఫార్మసీ, ఫార్మా. డి, ఎం.ఫార్మసీ కోర్సులు పూర్తి చేసుకొని బయటకు వస్తున్నారని, వీరికి నూరు శాతం ఉద్యోగాలు లభిస్తున్నాయన్నారు.

కరస్పాండెంట్ సాధినేని శ్రీనివాస రావు, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఆడెపు రమేష్ , పరిపాలనా అధికారి దేవులపల్లి వినయ్ కుమార్, సీనియర్ అధ్యాపకులు డాక్టర్ నీలమ్మ, డాక్టర్ నరసింహారావు, నటేష్ కుమార్, నవీన్ కుమార్, ఫర్హీన్, విజయ లక్ష్మి, రాజ్ కుమార్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విద్యార్థులకి సర్టిఫికేట్లు పతకాలను బహూకరించారు. గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా విద్యార్థులు వారి తల్లిదండ్రులతో సహా పాల్గొన్నారు. కళాశాలల ప్రాంగణమంతా శనివారం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి సందడిగా సాగింది .

మరిన్ని వార్తలు