Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

Dial 100 : ఒక్కరోజే డయల్ 100 కు 90 కాల్స్.. ఎక్కడ, ఏంటా కథ తెలుసుకుందాం..! 

ప్రజల రక్షణే ధ్యేయంగా సూర్యాపేట జిల్లా పోలీస్ యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు . ప్రజల భద్రత, రక్షణే ప్రథమ కర్తవ్యంగా సెలవు దినాల్లోనూ సైతం రాత్రి పగలు తేడా లేకుండా ప్రజలకు అందుబాటులో ఉంటూ రక్షణ కల్పిస్తున్నారు..

Dial 100 : ఒక్కరోజే డయల్ 100 కు 90 కాల్స్.. ఎక్కడ, ఏంటా కథ తెలుసుకుందాం..! 

సెలవు దినాల్లోనూ సూర్యాపేట పోలీసుల సేవలు..!

ఆదివారం డయల్ 100 కు 90 కాల్స్.. పోలీస్ సేవల పట్ల హర్షం..! 

సూర్యాపేట, మనసాక్షి :

ప్రజల రక్షణే ధ్యేయంగా సూర్యాపేట జిల్లా పోలీస్ యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు . ప్రజల భద్రత, రక్షణే ప్రథమ కర్తవ్యంగా సెలవు దినాల్లోనూ సైతం రాత్రి పగలు తేడా లేకుండా ప్రజలకు అందుబాటులో ఉంటూ రక్షణ కల్పిస్తున్నారు.. జిల్లా ఎస్పి కే నరసింహ ఐపిఎస్ ఆదేశాలతో క్షేత్ర స్థాయి అధికారుల పర్యవేక్షణ నిరంతరాయంగా కొనసాగుతుంది.

ఆదివారం జూన్ 28 న ఒక్కరోజే జిల్లా వ్యాప్తంగా ‘డయల్ 100’ ద్వారా పోలీసులకు 90 ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదులపై సూర్యాపేట జిల్లా పోలీసులు అత్యంత వేగంగా స్పందించారు. ఫోన్ కాల్ వచ్చిన వెంటనే సగటున కేవలం 5 నుండి 12 నిమిషాల వ్యవధిలోనే స్పందించి టీమ్స్ బాధితుల వద్దకు చేరుకొని తగిన సహాయం అందించారు. జిల్లాలో డయల్ 100 పిర్యాదులపై బ్లూ కోట్స్, పెట్రో కార్ సిబ్బంది నిరంతరం క్షేత్రస్థాయిలో పటిష్టంగా పనిచేస్తున్నారు.

ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే ఘటనా స్థలానికి చేరుకునేలా ఈ బృందాలు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటున్నాయి. సిబ్బంది పనితీరును, జిల్లాలోని భద్రతా పరిస్థితులను పోలీస్ ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ప్రజల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యతనిస్తూ, ఎలాంటి అత్యవసర పరిస్థితిలోనైనా పోలీసు సేవలను వినియోగించుకోవాలని అధికారులు ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సూర్యాపేట జిల్లా ఎస్పీ కే నర్సింహా ఆధ్వర్యంలో పోలీస్ లు అందిస్తున్న సేవలకు, పోలీస్ వ్యవస్థ లో వచ్చిన మార్పు పట్ల ప్రజలు బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు