Miryalaguda : పెండింగ్ కేసులపై జిల్లా ఎస్పీ కీలక ఆదేశాలు.. మిర్యాలగూడ సర్కిల్ కార్యాలయం తనిఖీ..!
నల్లగొండ జిల్లా పోలీసు శాఖలో పరిపాలనా సామర్థ్యాన్ని మరింత మెరుగుపరచడం, కేసుల దర్యాప్తును వేగవంతం చేయడం, రికార్డుల నిర్వహణను పటిష్టంగా ఉంచే లక్ష్యంతో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మంగళవారం మిర్యాలగూడ రూరల్ సర్కిల్ కార్యాలయాన్ని వార్షిక తనిఖీ చేశారు.

Miryalaguda : పెండింగ్ కేసులపై జిల్లా ఎస్పీ కీలక ఆదేశాలు.. మిర్యాలగూడ సర్కిల్ కార్యాలయం తనిఖీ..!
మిర్యాలగూడ, మన సాక్షి:
నల్లగొండ జిల్లా పోలీసు శాఖలో పరిపాలనా సామర్థ్యాన్ని మరింత మెరుగుపరచడం, కేసుల దర్యాప్తును వేగవంతం చేయడం, రికార్డుల నిర్వహణను పటిష్టంగా ఉంచే లక్ష్యంతో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మంగళవారం మిర్యాలగూడ రూరల్ సర్కిల్ కార్యాలయాన్ని వార్షిక తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా కార్యాలయంలోని గ్రేవ్ కేసుల క్రైమ్ ఫైల్స్, పెండింగ్ కేసుల రికార్డులు, ఇతర కేసులకు సంబంధించిన దర్యాప్తు పత్రాలను పరిశీలించారు. బాధితులకు సత్వర న్యాయం అందేలా కేసుల దర్యాప్తును నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
హత్యలు, దోపిడీలు, మహిళలు, చిన్నారుల పై జరిగే నేరాలు, సైబర్ నేరాలు వంటి గ్రేవ్ కేసుల దర్యాప్తు పురోగతిని సమీక్షించిన ఎస్పీ, పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన ఛేదించాలని సూచించారు. ప్రతి కేసులో శాస్త్రీయ ఆధారాలు, సాంకేతిక సాక్ష్యాలను సమర్థంగా సేకరించి, నిందితులకు చట్టపరమైన శిక్షలు పడేలా నాణ్యమైన దర్యాప్తు నిర్వహించాలని స్పష్టం చేశారు.
అలాగే సీసీటీఎన్‌ఎస్ నమోదు విధానం, డిజిటల్ రికార్డుల నిర్వహణ, కోర్టు కేసుల డిస్పోజల్ ఫాలోఅప్, వారెంట్ల అమలు, పెండింగ్ ప్రక్రియలపై కూడా సమీక్ష నిర్వహించి, అన్ని రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరించాలని సూచించారు.
ప్రజలకు పోలీస్ శాఖపై విశ్వాసం మరింత పెరిగేలా ప్రతి అధికారి బాధ్యతాయుతంగా, పారదర్శకంగా పనిచేయాలని, ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించేలా అందుబాటులో ఉండాలని ఎస్పీ ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణలో ఎలాంటి అలసత్వం సహించబోమని, ప్రజా భద్రతే పోలీస్ శాఖ ప్రధాన బాధ్యత అని స్పష్టం చేశారు. ఈ తనిఖీలో రూరల్ సీఐ పి.ఎన్.డి. ప్రసాద్‌తో పాటు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.