Breaking Newsక్రైంజిల్లా వార్తలునల్గొండ
Miryalaguda : మిర్యాలగూడలో పేకాట స్థావరంపై దాడి.. ఏడుగురు అరెస్ట్..!
మిర్యాలగూడ మండలంలో పేకాట ఆడుతున్న స్థావరంపై రూరల్ పోలీసులు దాడులు నిర్వహించి ఏడుగురుని అరెస్ట్ చేశారు.

Miryalaguda : మిర్యాలగూడలో పేకాట స్థావరంపై దాడి.. ఏడుగురు అరెస్ట్..!
మిర్యాలగూడ, మన సాక్షి :
నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలో పేకాట ఆడుతున్న స్థావరంపై రూరల్ పోలీసులు దాడులు నిర్వహించి ఏడుగురుని అరెస్ట్ చేశారు. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం సాయంత్రం మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెం లోని నయారా పెట్రోల్ బంకు వెనకాల గల ఖాళీ స్థలంలో కొంతమంది పేకాట ఆడుతున్నారని సమాచారం పై దాడి చేశారు. ఏడుగురిని పట్టుబడి చేయగా ఒక వ్యక్తి పారిపోయినాడు, పట్టుబడిన వారి నుండి 2790 నగదు, ఐదు సెల్ ఫోన్లు, ఐదు మోటర్ సైకిల్లు, 104 ప్లేయింగ్ కార్డులు, గ్రౌండ్ షీట్ స్వాధీనపరచుకొని పంచనామ నిర్వహించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు.









