Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
జిల్లా వార్తలుBreaking Newsనల్గొండ

Devarakonda : దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు..!

దేవరకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ జన్మదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం చింతపల్లి మండల పరిధిలోని వింజమూరు గ్రామ శివారులో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వారి కుటుంబ సభ్యులతో కలిసి స్వామి సన్నిధిలో పూజలు నిర్వహించారు.

Devarakonda : దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు..!

చింతపల్లి, వన సాక్షి :

దేవరకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ జన్మదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం చింతపల్లి మండల పరిధిలోని వింజమూరు గ్రామ శివారులో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వారి కుటుంబ సభ్యులతో కలిసి స్వామి సన్నిధిలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ కమిటీ నిర్వాహకులు ఎమ్మెల్యే బాలునాయ క్ ను సాదరంగా ఆహ్వానించి వేద పండితులచే ప్రత్యేక ఆశీర్వచనాలు అందజేసి ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యేకు తీర్థప్రసాదాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జటావత్ హరినాయక్, మాల్ మార్కెట్ కమిటీ చైర్మన్ దొంతం అలివేలు సంజీవరెడ్డి, మాజీ ఎంపీపీ కొండూరు భవాని పవన్ కుమార్,ఎరుకల వెంకటయ్య గౌడ్, అంగిరేకుల గోవర్ధన్, మాస భాస్కర్, గుండ్లపల్లి నర్సిరెడ్డి, వింజమూరు సర్పంచ్ యాచారం యాదయ్య గౌడ్, గొల్లపల్లి సర్పంచ్ అనంతుల శ్రీనివాస్ గౌడ్, ప్రశాంతి తండా సర్పంచ్ కేతావత్ శ్రీను నాయక్, నేనావత్ దశరథ్ నాయక్, దొంతగోని శేఖర్ గౌడ్, ఆంగిరేకుల శ్రీకాంత్, మాజీ ఎంపిటిసి ఎండి మజార్ అలీ బేగ్ పాషా, మద్దెల కృష్ణ గౌడ్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మునుకుంట్ల శేఖర్ గౌడ్, వీరితో పాటు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు