Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలునల్గొండ

Nalgonda : గొర్రెలు మేపడానికి వెళ్లి మూసి కాలువలో పడి వ్యక్తి మృతి..!

గొర్రెలు మేపడానికి వెళ్లి ప్రమాదశాత్తు మూసి కాలువలో పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన నల్లగొండ జిల్లా కేతపల్లి మండలంలో చోటు చేసుకుంది.

Nalgonda : గొర్రెలు మేపడానికి వెళ్లి మూసి కాలువలో పడి వ్యక్తి మృతి..!

కేతెపల్లి,మన సాక్షి:

గొర్రెలు మేపడానికి వెళ్లి ప్రమాదశాత్తు మూసి కాలువలో పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన నల్లగొండ జిల్లా కేతపల్లి మండలంలో చోటు చేసుకుంది. స్థానిక ఎస్ఐ సతీష్ తెలిపిన వివరాల ప్రకారం… మండలంలోని కొత్తపేట గ్రామానికి చెందిన మోదాల లింగయ్య (46) రోజు మాదిరిగా తన వృత్తిరీత్యా గొర్రెలను కాస్తూ, వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

శనివారం రోజున ఉదయం 10 గంటలకు గుడివాడ గ్రామం వైపు గల గోదాం ఏరియాలో తన గొర్రెలను మేపడానికి వెళ్లాడు. సాయంత్రం ఏడు గంటల సమయంలో గొర్రెలు మాత్రమే ఇంటికి రావడంతో మృతుడి ఆసక్తి గురించి కుటుంబ సభ్యులు కొత్తపేట చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు.

ఆదివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో కొత్తపేట గ్రామ శివారులోని కాటమయ్య గుడి దగ్గర మూసి కాలువలో మృతదేహం లభ్యమైనది. మృతుడి పెద్ద కుమారుడు మోదాల సందీప్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్టు ఎస్ఐ తెలిపారు.

మరిన్ని వార్తలు