Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా

Suryapet : పట్టణ ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులుగా మాడుగుల నవీన్ కుమార్ నియామకం..!

సూర్యాపేట పట్టణ ఆర్యవైశ్య మహాసభ యువజన సంఘం అధ్యక్షులుగా మాడుగుల నవీన్ కుమార్ నియామకమయ్యారు.

Suryapet : పట్టణ ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులుగా మాడుగుల నవీన్ కుమార్ నియామకం..!

సూర్యాపేట, మనసాక్షి :

సూర్యాపేట పట్టణ ఆర్యవైశ్య మహాసభ యువజన సంఘం అధ్యక్షులుగా మాడుగుల నవీన్ కుమార్ నియామకమయ్యారు. మంగళవారం సూర్యాపేట పట్టణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు బెలిదే శ్రీనివాసులు నియామక పత్రం అందజేశారు. వీరు గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల మన్నులు పొందుతున్నారు.

సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీరి నియామకం పట్ల పలువురు ఆర్యవైశ్య నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట ఆర్యవైశ్య మహాసభ పొలిటికల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి బిక్కుమల్ల కృష్ణ, కోశాధికారి ఉప్పల శ్రవణ్ కుమార్ నాయకులు ఉప్పల సత్యనారాయణ గుండా వెంకన్న, ఓరుగంటి రామమూర్తి ,మిట్టపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు