District Collector : జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం.. ఓటర్ల సందేహాల కోసం హెల్ప్‌డెస్క్ ఏర్పాటు..!
సూర్యాపేట జిల్లాలో ఎస్ఐఆర్–2026 ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఈ ప్రక్రియలో భాగంగా ప్రజలకు ఎదురయ్యే సందేహాలను తీర్చేందుకు, ఎన్యుమరేషన్ ఫారమ్ నింపే విధానంపై అవగాహన కల్పించేందుకు జిల్లా కలెక్టరేట్లో ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేశారు.

District Collector : జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం.. ఓటర్ల సందేహాల కోసం హెల్ప్‌డెస్క్ ఏర్పాటు..!
సూర్యాపేట, మనసాక్షి :
సూర్యాపేట జిల్లాలో ఎస్ఐఆర్–2026 ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఈ ప్రక్రియలో భాగంగా ప్రజలకు ఎదురయ్యే సందేహాలను తీర్చేందుకు, ఎన్యుమరేషన్ ఫారమ్ నింపే విధానంపై అవగాహన కల్పించేందుకు జిల్లా కలెక్టరేట్లో ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేశారు.
2002 ఓటరు జాబితాలో వివరాల పరిశీలనతో పాటు ఇతర సాంకేతిక ఇబ్బందుల పరిష్కారానికి ఈ కేంద్రం నిరంతరం అందుబాటులో ఉంటుందని జిల్లా కలెక్టర్ తేజస్ నందు లాల్ పవార్ తెలిపారు. ఓటరు నమోదు, మార్పులు, చేర్పులు లేదా ఎస్ఐఆర్ ప్రక్రియపై ఏవైనా సందేహాలు ఉంటే ఈ క్రింది నంబర్లకు ఫోన్ చేయాలని జిల్లా ఎన్నికల యంత్రాంగం సూచించింది.
- కలెక్టరేట్ ఆఫీస్ హెల్ప్‌డెస్క్: 6281492368
- బి. భరత్ (డి.టి. ఎలక్షన్): 9573085943
- కె. రణదీప్ (ఐటీ సపోర్ట్): 9059170790
వివరాలు ధృవీకరించుకోవాలి..
జిల్లాలోని ఓటర్లందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. ముఖ్యంగా 2002 ఓటరు జాబితాలో తమ వివరాలు ఎలా ఉన్నాయో చూసుకోవాలని, ఎన్యుమరేషన్ ఫారమ్‌లను తప్పులు లేకుండా నింపేందుకు హెల్ప్‌డెస్క్ సిబ్బంది సహకారం తీసుకోవాలని సూచించారు. పారదర్శకమైన ఓటరు జాబితా రూపకల్పనలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని జిల్లా ఎన్నికల యంత్రాంగం విజ్ఞప్తి చేసింది.