Breaking Newsజిల్లా వార్తలునారాయణపేట జిల్లా
Narayanpet : రేపు రెండు గంటలు విద్యుత్ అంతరాయం… వెళలు ఇవే..!
నారాయణపేట మండలంలో రెండు గంటల పాటు విద్యుత్ అంతరాయం ఏర్పడనున్నది.

Narayanpet : రేపు రెండు గంటలు విద్యుత్ అంతరాయం… వెళలు ఇవే..!
నారాయణపేట టౌన్, మన సాక్షి :
నారాయణపేట మండలంలో రెండు గంటల పాటు విద్యుత్ అంతరాయం ఏర్పడనున్నది. అప్పకపల్లి 33/11 కే.వి. ఉప విద్యుత్ కేంద్రం లో మరమ్మతు పనుల కారణంగా ఆదివారం ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు రెండు గంటల పాటు విద్యుత్తు అంతరాయం ఉంటుందని గ్రామీణ ఏఈ సాయినాథ్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.
33/11 కే.వి. ఉప విద్యుత్ కేంద్రంలో నూతన ఏ.వి.స్వీచ్. ఏర్పాటు చేస్తున్నందున అప్పక్ పల్లి ఉప విద్యుత్ కేంద్రం పరిధిలో ఉన్న అమ్మి రెడ్డి పల్లి , అప్పీరెడ్డి పల్లి , జాజాపూర్, ప్రభుత్వ మెడికల్ కళాశాల, అప్పక్ పల్లి గ్రామాలకు విద్యుత్ సరఫరా ఉండదని కావున రైతులు, విద్యుత్ వినియోగదారులు , వ్యాపరస్తులు ఈ విద్యుత్ అంతరాయానికి సహకరించాలని ఆయన కోరారు.









