Breaking Newsజాతీయంతెలంగాణ
TG News : తెలంగాణలో “సర్” గడువు పొడిగింపు.. ఎప్పటి వరకంటే.. షెడ్యూల్ ఇదే..!
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) గడువు తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించింది. అందుకు సంబంధించిన బుధవారం ఎన్నికల సంఘం సవరించింది.

TG News : తెలంగాణలో “సర్” గడువు పొడిగింపు.. ఎప్పటి వరకంటే.. షెడ్యూల్ ఇదే..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) గడువు తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించింది. అందుకు సంబంధించిన బుధవారం ఎన్నికల సంఘం సవరించింది. దాంతో బిఎల్ఓ ల ఇంటింటి సర్వేకు ఆగస్టు 3వ తేదీ వరకు గడువును పొడిగించారు. ఆగస్టు 10వ తేదీన డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదల చేయనున్నది. సెప్టెంబర్ 9వ తేదీ వరకు క్లైములు, అభ్యంతరాలను స్వీకరించనున్నది. అక్టోబర్ 8వ తేదీ వరకు అభ్యంతరాలను పరిష్కరించనున్నారు. అక్టోబర్ 12వ తేదీ తుది ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారు.
సర్ గడువును పొడిగించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సర్ షెడ్యూల్ ను ఎన్నికల సంఘం సవరించింది. సవరించిన షెడ్యూల్ అధికారులతో పాటు రాజకీయ పార్టీలకు తెలియజేయాలని ఉత్తర్వులలో ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.









