District collector : నల్గొండ జిల్లా కలెక్టర్ ఆగ్రహం.. వైద్య సిబ్బందికి శోకాజ్ నోటీసులకు ఆదేశం..!
గత కొంతకాలంగా వివాదాస్పదంగా మారుతున్న స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ ఆకస్మికంగా సందర్శించారు.

District collector : నల్గొండ జిల్లా కలెక్టర్ ఆగ్రహం.. వైద్య సిబ్బందికి శోకాజ్ నోటీసులకు ఆదేశం..!
శాలిగౌరారం, మనసాక్షి :
గత కొంతకాలంగా వివాదాస్పదంగా మారుతున్న స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ ఆకస్మికంగా సందర్శించారు. రికార్డుల ను,వైద్య సిబ్బంది బయోమెట్రిక్ సిస్టమును పరిశీలించారు.రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యం, సమయపాలన పాటించని వైద్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పలుమార్లు వైద్య కోసం వచ్చిన మండల ప్రజలకు సరైన వైద్యం అందించకుండా విధులలో విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న సిబ్బందిపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.రికార్డుల నిర్వహణ సరిగ్గా నిర్వహించకుండా సమయపాలన పాటించకుండా విధుల పట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారని వీరందరికీ వెంటనే షోకాజు నోటీసు జారీ చేయాలని నల్గొండ డీఎంహెచ్ఓ కి ఆదేశించారు.
కేజీబీవీ హాస్టల్ ని సందర్శించిన కలెక్టర్
స్థానిక కేజీబీవీ హాస్టల్ ని సందర్శించి విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొన్నారు.విద్యార్థులు యూనిఫాం సమస్యను కలకరు కలెక్టర్ దృష్టికి తేవడం తో రెండు రోజులలో టైలర్ తో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమం లో నల్గొండ ఆర్డీవో వై. అశోక్ రెడ్డి,తహసిల్దార్ మాధవరావు,ఎంపిడివో జాల రజిత సర్పంచ్ శేఖర్ బాబు వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు.









