Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంతెలంగాణహైదరాబాద్

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యయత్నానికి ముందు.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందేమిటి..!

శిక్షణలో ఉన్న ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి సోమవారం ఉదయం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తోటి మహిళ ట్రైనింగ్ ఐపీఎస్ ను లైంగికంగా వేధించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యయత్నానికి ముందు.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందేమిటి..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

శిక్షణలో ఉన్న ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి సోమవారం ఉదయం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తోటి మహిళ ట్రైనింగ్ ఐపీఎస్ ను లైంగికంగా వేధించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ ఘటనపై అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. ఉన్నతాధికారులు ఉదయ్ కృష్ణారెడ్డికి నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. కాగా అమీర్పేట్ లీల నగర్ లోని గోల్డెన్ పీకాక్ రెసిడెన్సి ప్లాట్ నెంబర్ 102 లో చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. కుటుంబ సభ్యులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.

అనంతరం ఉదయ్ కృష్ణారెడ్డి ని ఉమేష్ చంద్ర విగ్రహం సమీపంలోని జయంతి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతుంది. ఇది ఇలా ఉండగా ఆత్మహత్యయత్నా నికి ముందు ఉదయ్ కృష్ణారెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు, అదేవిధంగా వాట్సాప్ స్టేటస్ పెట్టినట్లు సమాచారం.

అయితే ఆ వాట్సాప్ స్టేటస్ లో ఏముందంటే..

నాపై వచ్చిన ఫిర్యాదులు మరియు వదంతులు నిరాధారమైనవి మరియు అవాస్తవమైనవి.

నేను న్యాయ ప్రక్రియను పూర్తిగా విశ్వసిస్తున్నాను మరియు న్యాయం గెలుస్తుందని నమ్ముతున్నాను.

వార్తా ప్రచురణలు చేసే ముందు వాస్తవాలను నిర్ధారించుకోవాలని మీడియాను వినయపూర్వకంగా కోరుతున్నాను.

ఎం. ఉదయ కృష్ణ రెడ్డి

మరిన్ని వార్తలు