Suryapet : తిరుమలగిరిలో ప్రైవేట్ ఆసుపత్రి సీజ్..!
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలోని తిరుమలగిరి మండలంలో ప్రవేట్ ఆసుపత్రిని వైద్యశాఖ అధికారులు సీజ్ చేశారు.

Suryapet : తిరుమలగిరిలో ప్రైవేట్ ఆసుపత్రి సీజ్..!
తుంగతుర్తి, మన సాక్షి :
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలోని తిరుమలగిరి మండలంలో ప్రవేట్ ఆసుపత్రిని వైద్యశాఖ అధికారులు సీజ్ చేశారు. తిరుమలగిరి మండల కేంద్రంలో శ్రీ బాలాజీ హాస్పిటల్ లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు సమాచారం రావడంతో గురువారం వైద్యశాఖ అధికారులు తనిఖీ చేశారు.
ఈ మేరకు ఆల్ట్రా సౌండ్ మిషన్తో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు గుర్తించి ఆసుపత్రి సీజ్ చేసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు టి సి పి ఎన్ డి టి పిఓ డాక్టర్ నజియా తబస్సు తెలిపారు. ఆమె వెంట ఎస్ఓఎంఏ బాసి డిప్యూటీ సంజీవరెడ్డి మత్స్యగిరి శర్మ ఉపేందర్ శంకర్రావు తదితరులు పాల్గొన్నారు.
ఆస్పత్రి పరిశీలన లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యాధికారి వెంకటరమణ హెచ్చరించారు. గురువారం తిరుమలగిరిలో సీజ్ చేసిన ఆసుపత్రిని ఆయన తనిఖీ చేశారు ఆయన వెంట డాక్టర్ సజియ తబస్సు ఎస్ఓ ఎంఏ బాసి డిప్యూటీ పలువురు వైద్యాధికారులు సిబ్బంది పాల్గొన్నారు.









