Breaking Newsఆంధ్రప్రదేశ్
గంగమ్మ తల్లిని దర్శించుకున్న చమర్తి జగన్ మోహన్ రాజు..!
రాజంపేట ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బోయకొండ గంగమ్మ తల్లిని రాజంపేట నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు దర్శించుకున్నారు.

గంగమ్మ తల్లిని దర్శించుకున్న చమర్తి జగన్ మోహన్ రాజు..!
రామసముద్రం, మనసాక్షి :
రాజంపేట ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బోయకొండ గంగమ్మ తల్లిని రాజంపేట నియోజకవర్గ ఇన్చార్జ్ చామర్తి జగన్ మోహన్ రాజు దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి చేరుకున్న ఆయనకు దేవస్థాన అధికారి ఏ వో ఏకాంబరం,లు, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన జగన్ మోహన్ రాజు కి, వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. దర్శనానంతరం ఆలయ అధికారులు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేసి, ఆలయ మర్యాదలతో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో రాజంపేట టౌన్ అధ్యక్షుడు దగ్గుపాటి సుబ్రహ్మణ్యం నాయుడు, వైస్ ఏఎంసి చైర్మన్ కర్ణాటకం చెంగల్ రాయుడు, సీనియర్ నాయకులు కొవ్వూరు సుబ్రహ్మణ్యం నాయుడు, పుంగనూరు టిడిపి సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం రాజు (బాబు )మరియు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు వీరబల్లి మండల నాయకులు పాల్గొన్నారు.










