Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా

Suryapet : సూర్యాపేట మున్సిపల్ షాపులు బహిరంగ వేలం.. ధరఖాస్తుల ఆహ్వానం..! 

సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో ఖాళీగా ఉన్న పలు మున్సిపల్ షాపులను బహిరంగ వేలం ద్వారా అద్దెకు ఇవ్వనున్నట్లు మున్సిపల్ కమిషనర్ సి.హెచ్. హన్మంత్ రెడ్డి తెలిపారు.

Suryapet : సూర్యాపేట మున్సిపల్ షాపులు బహిరంగ వేలం.. ధరఖాస్తుల ఆహ్వానం..! 

సూర్యాపేట, మనసాక్షి :

సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో ఖాళీగా ఉన్న పలు మున్సిపల్ షాపులను బహిరంగ వేలం ద్వారా అద్దెకు ఇవ్వనున్నట్లు మున్సిపల్ కమిషనర్ సి.హెచ్. హన్మంత్ రెడ్డి తెలిపారు. పాత మున్సిపల్ కార్యాలయంలోని గ్రౌండ్‌ఫ్లోర్, ఫస్ట్‌ఫ్లోర్ షాపులతో పాటు స్వామి వివేకానంద షాపింగ్ కాంప్లెక్స్, కిషన్‌గంజ్ కూరగాయల మార్కెట్, అలంకార్ థియేటర్ ఎదురుగా ఉన్న షాపులను వేలం వేయనున్నట్లు పేర్కొన్నారు.

ఆసక్తి గల వ్యక్తులు మున్సిపల్ కార్యాలయ పని వేళల్లో రూ.50 చెల్లించి దరఖాస్తు ఫారం పొందాలని కమిషనర్ సూచించారు. నిబంధనలు, షరతులకు లోబడి పూర్తి చేసిన దరఖాస్తులను ఈ నెల18వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు మున్సిపల్ కార్యాలయంలో సమర్పించాలన్నారు. 19వ తేదీ ఉదయం 11 గంటలకు మున్సిపల్ కార్యాలయంలో బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు తెలిపారు. వేలానికి సంబంధించిన ఇతర వివరాల కోసం కార్యాలయ పని వేళల్లో మున్సిపల్ రెవెన్యూ విభాగాన్ని సంప్రదించాలని కమిషనర్ సూచించారు..

మరిన్ని వార్తలు