Hyderabad : వైద్య విద్యార్థి ఆత్మహత్య.. హైదరాబాదులో విషాదం..!
హైదరాబాదులోని రామంతపూర్ లో విషాద సంఘటన చోటుచేసుకుంది. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న 18 సంవత్సరాల విద్యార్థి భరద్వాజ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Hyderabad : వైద్య విద్యార్థి ఆత్మహత్య.. హైదరాబాదులో విషాదం..!
మన సాక్షి, హైదరాబాద్ :
హైదరాబాదులోని రామంతపూర్ లో విషాద సంఘటన చోటుచేసుకుంది. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న 18 సంవత్సరాల విద్యార్థి భరద్వాజ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మానసిక ఒత్తిడితోనే ఈ ఘటనకు జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తుంది. అయినప్పటికీ అసలు కారణాలపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామంతపూర్ లో నివాసం ఉంటున్న భరద్వాజ్ ఆదివారం తెల్లవారు జామున 3.20 గంటల సమయంలో ఇంటి నుంచి ఎవరికి చెప్పకుండా బయటికి వెళ్లాడు. కుటుంబ సభ్యులు అతడి కోసం ఆరా తీసినట్లు తెలుస్తుంది. కాగా రామంతపూర్ లో నిర్మాణంలో ఉన్న ఎన్ఎస్ఎల్ భవనంపై నుంచి దూకడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన వల్ల అతడు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.









