6, 7 న ధర్మపురి లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక & ప్రణాళిక మంత్రి , మల్లు భట్టి విక్రమార్క సెప్టెంబర్ 6, 7 తేదీల్లో జగిత్యాల జిల్లా ధర్మపురిలో పర్యటించనున్నారు.

6, 7 న ధర్మపురి లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన
మనసాక్షి, జగిత్యాల జిల్లా ప్రతినిధి :
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక & ప్రణాళిక మంత్రి , మల్లు భట్టి విక్రమార్క సెప్టెంబర్ 6, 7 తేదీల్లో జగిత్యాల జిల్లా ధర్మపురిలో పర్యటించనున్నారు. సెప్టెంబర్ 6వ తేదీ ఆదివారం సాయంత్రం 4.00 గంటలకు హైదరాబాద్‌లోని ప్రజాభవన్, బేగంపేట్ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి, రాత్రి 7.30 గంటలకు ధర్మపురికి చేరుకుంటారు. అనంతరం అధికారులు, ప్రజాప్రతినిధులు, ఇతర ప్రముఖులతో సమావేశమై, రాత్రి ధర్మపురిలో బస చేయనున్నారు.
సెప్టెంబర్ 7వ తేదీ సోమవారం తెల్లవారుజామున 2.58 గంటలకు ధర్మపురిలోని శ్రీ ఉగ్ర నరసింహ స్వామి వారి దేవస్థానాల ఆధ్వర్యంలో పునర్నిర్మించనున్న శ్రీ ఉగ్ర నరసింహ స్వామి వారి ఆలయ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పాల్గొంటారు.
అనంతరం ఉదయం 5.00 గంటలకు ధర్మపురి నుంచి రోడ్డు మార్గంలో హైదరాబాద్‌కు బయలుదేరి, ఉదయం 8.30 గంటలకు ప్రజాభవన్, బేగంపేట్‌కు చేరుకుంటారు.ఉప ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా సంబంధిత శాఖల అధికారులు భద్రత, బందోబస్తు, రవాణా, వసతి తదితర ఏర్పాట్లను సమన్వయంతో చేపట్టాలని సూచించారు.









