Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలునల్గొండరాజకీయం

చింతపల్లి రిజర్వాయర్ భూములపై దేవరకొండ ఎమ్మెల్యేకు రైతుల వినతి..!

నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం చింతపల్లి మండల పరిధిలోని రిజర్వాయర్ లో భూములు కోల్పోతున్న రైతులు బుధవారం ఉదయం హైదరాబాదులోని దేవరకొండ ఎమ్మెల్యే నివాస గృహంలో దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ ను కలిసి భూములు కోల్పోతున్న రైతులు తమ ఆవేదనను వ్యక్తపరిచారు.

చింతపల్లి రిజర్వాయర్ భూములపై దేవరకొండ ఎమ్మెల్యేకు రైతుల వినతి..!

చింతపల్లి, మనసాక్షి :

నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం చింతపల్లి మండల పరిధిలోని రిజర్వాయర్ లో భూములు కోల్పోతున్న రైతులు బుధవారం ఉదయం హైదరాబాదులోని దేవరకొండ ఎమ్మెల్యే నివాస గృహంలో దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ ను కలిసి భూములు కోల్పోతున్న రైతులు తమ ఆవేదనను వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా రైతులు ఎమ్మెల్యే తో మాట్లాడుతూ రిజర్వాయర్ కోసం భూములు కోల్పోతున్న రైతుల తగిన న్యాయం చేయాలని సమస్యలను వివరించి వినతిపత్రం అందజేయడం జరిగింది.

రిజర్వాయర్ కోసం భూములు కోల్పోతున్న రైతులకు ఎకరానికి కనీసం రూ.30 లక్షల నష్టపరిహారం చెల్లించాలని, లేనిపక్షంలో చింతపల్లి రిజర్వాయర్‌ను రద్దు చేయించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ను రైతులు కోరారు.

అలాగే రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశంలో ఈ సమస్యను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, చింతపల్లి రిజర్వాయర్‌లో భూములు కోల్పోతున్న రైతులకు తగిన న్యాయం జరిగేలా చూడాలని ఎమ్మెల్యే కు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే ను కలిసిన వారిలో కాంగ్రెస్ పార్టీ
రాష్ట్ర నాయకులు నల్లా రఘుమారెడ్డి,

డీసీసీ ప్రధాన కార్యదర్శి ఎరుకల వెంకటయ్య కాసారపు శ్రీను , చింతపల్లి పిఎసిఎస్ చైర్మన్ లింగపల్లి వెంకటయ్య చింతపల్లి మాజీ నీటి సంఘం చైర్మన్ ఎల్లంకి రాధాకృష్ణ సిద్ధిక్ బాబా కంచుకట్ల గణేష్ , పుచ్చల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు