Miryalaguda : బొగ్గు లేని ప్రాంతంలో కమిషన్ల కోసమే పవర్ ప్లాంట్ ఏర్పాటు.. వారికి ఏటీఎం గా మారింది.. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి
బొగ్గు అందుబాటులో లేని ప్రాంతంలో కేవలం కమిషన్ల కోసమే పవర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారని మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ఆరోపించారు.

Miryalaguda : బొగ్గు లేని ప్రాంతంలో కమిషన్ల కోసమే పవర్ ప్లాంట్ ఏర్పాటు.. వారికి ఏటీఎం గా మారింది.. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి
మిర్యాలగూడ, మన సాక్షి :
బొగ్గు అందుబాటులో లేని ప్రాంతంలో కేవలం కమిషన్ల కోసమే పవర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారని మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ఆరోపించారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ వద్ద బి ఆర్ ఎస్ ధర్నా కు కౌంటర్‌గా మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ వద్ద కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణంలో బినామీ కాంట్రాక్టులు, కమిషన్ల పేరుతో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేటీఆర్ కుటుంబానికి ఏటీఎంగా మారితే.. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావులకు ఏటీఎంలా మారిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Also Read : Miryalaguda : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ వద్ద బీఆర్‌ఎస్ భారీ ధర్నా..!
బొగ్గు అందుబాటులో లేని ప్రాంతంలో కేవలం కమిషన్ల కోసమే పవర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారని, దూర ప్రాంతాల నుంచి బొగ్గును తరలించడం వల్ల ప్లాంట్‌పై అదనపు ఆర్థిక భారం పడుతోందని ఎమ్మెల్యే ఆరోపించారు. అభివృద్ధి పేరుతో పార్టీ ఫిరాయింపులకు పాల్పడి, పవర్ ప్లాంట్ నిర్మాణంలో కమిషన్లు దండుకున్నారని విమర్శించారు. అదేవిధంగా పవర్ ప్లాంట్ కోసం భూములు కోల్పోయిన భూనిర్వాసితులకు అన్యాయం జరిగిందని, స్థానిక భూ నిర్వాసితుల ప్రయోజనాలను పక్కనపెట్టి బీఆర్‌ఎస్ నాయకుల కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇప్పించుకున్నారని ఆరోపించారు.
గతంలో అవినీతికి పాల్పడ్డారని మేము ఆరోపిస్తున్న వ్యక్తులు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని పవర్ ప్లాంట్ సందర్శనకు వచ్చారు అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పనులను యుద్ధ ప్రాతిపదికన ముందుకు తీసుకెళ్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. నిర్మాణంలో ఉన్న నాలుగు యూనిట్లను పూర్తి చేసి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని, త్వరలో *ఐదో యూనిట్‌ను కూడా ప్రారంభించే దిశగా కృషి చేస్తామని స్పష్టం చేశారు.
Also Read : ప్రణయ్ హత్య కేసులో ఏ 4 నిందితుడు అబ్దుల్ బారీ చర్లపల్లి జైలులో మృతి..!
పవర్ ప్లాంట్ కోసం భూములు కోల్పోయిన భూనిర్వాసితులకు అండగా నిలిచి, వారికి న్యాయం జరిగేలా, అర్హత మేరకు ఉద్యోగాలు లభించేలా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నేను ఎవరికీ భయపడను. ప్రజల కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం పోరాడుతాను. గతంలో జరిగిన అవినీతి, అక్రమాలను ప్రజల ముందుకు తీసుకువస్తాం అని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు.









