Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయంసంక్షేమం
Miryalaguda : నేడు మిర్యాలగూడలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ.. హాజరుకానున్న మంత్రి ఉత్తమ్..!
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఈనెల 28 న ఉదయం 10.30 గంటలకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు.

Miryalaguda : నేడు మిర్యాలగూడలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ.. హాజరుకానున్న మంత్రి ఉత్తమ్..!
మిర్యాలగూడ, మన సాక్షి :
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఈనెల 28 న ఉదయం 10.30 గంటలకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. మిర్యాలగూడలోని ఎస్పీ గార్డెన్స్ లో రాష్ట్రా నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ కి ముఖ్య అతిధిగా హాజరై పంపిణీ చేస్తారని తెలిపారు. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ అనంతరం మంత్రి ఉదయం 11.40 గంటలకు సూర్యాపేట జిల్లా వెళ్తారని ఆయన వెల్లడించారు.









