చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి..!
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ , ఓటర్ల పేర్ల తొలగింపు, కొత్త ఓటర్ల నమోదు తదితర అంశాలపై కాంగ్రెస్ పార్టీ లేవనెత్తుతున్న అభ్యంతరాల నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేష్‌కుమార్ గౌడ్ సూచన మేరకు, నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాస్ నేత ఆధ్వర్యంలో సోమవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట ధర్నా, నిరసన కార్యక్రమం నిర్వహించారు.

చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి..!
బీజేపీ చేతిలో కీలుబొమ్మలా మారిన చీఫ్ ఎలక్షన్ కమిషనర్….
‘ఓటు చోరీ’ ఆరోపణలపై నల్లగొండ కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ ధర్నా
సీఈసీ దిష్టిబొమ్మ దహనం
నల్గొండ / చింతపల్లి, మనసాక్షి.
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ , ఓటర్ల పేర్ల తొలగింపు, కొత్త ఓటర్ల నమోదు తదితర అంశాలపై కాంగ్రెస్ పార్టీ లేవనెత్తుతున్న అభ్యంతరాల నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేష్‌కుమార్ గౌడ్ సూచన మేరకు, నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాస్ నేత ఆధ్వర్యంలో సోమవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట ధర్నా, నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు.ఈ కార్యక్రమంలో దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలు నాయక్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రతి పౌరుడి హక్కు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరి ఓటు సురక్షితంగా ఉండేలా ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా సాగాలి. ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ లేవనెత్తుతున్న ప్రశ్నలకు ఎన్నికల సంఘం స్పష్టమైన సమాధానాలు ఇవ్వాలి”అని అన్నారు.
ఓటర్ల జాబితా, సర్ ప్రక్రియకు సంబంధించి అనేక అంశాలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల సంఘంలోని ఇద్దరు కమిషనర్లు కూడా కొన్ని అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు పూర్తి వివరాలు వెల్లడించి, ఎన్నికల ప్రక్రియపై విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉంది”అని బాలు నాయక్ అన్నారు. ఈ అంశాలపై సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది.
ఓటర్ల జాబితాలో ఎవరి పేర్లు తొలగించబడ్డాయి, ఎందుకు తొలగించబడ్డాయి, ఏ విధానాన్ని అనుసరించారు అనే విషయాలపై పారదర్శకత అవసరం. అర్హత ఉన్న ఒక్క ఓటరు కూడా తన ఓటు హక్కును కోల్పోకుండా చూడాలి. ప్రజాస్వామ్యంపై ప్రజలకు నమ్మకం మరింత బలపడేలా ఎన్నికల సంఘం వ్యవహరించాలి”అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఓటు చోరీ’పై సమగ్ర వివరణ ఇవ్వాలి
కాంగ్రెస్ పార్టీ లేవనెత్తుతున్న ఓటు చోరీ’ ఆరోపణలపై సమగ్ర, స్వతంత్ర పరిశీలన జరగాలని బాలు నాయక్ కోరారు. సర్ లో కొత్త ఓటర్ల నమోదు, ఓటర్ల తొలగింపు, ఓటర్ల డేటా నిర్వహణ తదితర అంశాలపై వచ్చిన అభ్యంతరాలకు ఎన్నికల సంఘం స్పష్టత ఇవ్వాలని అన్నారు.
ఓటు అనేది ప్రజల ప్రజాస్వామ్య హక్కు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అనుమానాలకు తావులేకుండా పూర్తి పారదర్శకత ఉండాలి. ఓటర్ల హక్కుల పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య పద్ధతిలో తన నిరసనను తెలియజేస్తోంది” అని ఎమ్మెల్యే బాలు నాయక్ తెలిపారు.
నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సభ్యులు, అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ధర్నా అనంతరం సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని నినాదాలు చేస్తూ దిష్టిబొమ్మ దహనం చేశారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో చేపడుతున్న నిరసనల్లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు పార్టీ నాయకులు తెలిపారు.









