Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుహైదరాబాద్

ఇంకుడు గుంత కనిపించడంలేదంటూ ప్రజావాణిలో ఫిర్యాదు..! 

ప్రజాధనంతో ఏర్పాటు చేసిన ఇంకుడు గుంత ప్రస్తుతం కనిపించడంలేదని, దాని ఆచూకీపై విచారణ జరిపి వాస్తవాలను వెల్లడించాలని కోరుతూ మీర్జాలగూడ డివిజన్ పరిధిలోని చిన్మయ మార్గ్ కాలనీకి చెందిన జంగాల శ్రీరామ్ యాదవ్ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.

ఇంకుడు గుంత కనిపించడంలేదంటూ ప్రజావాణిలో ఫిర్యాదు..! 

మేడ్చల్ మల్కాజిగిరి, మన సాక్షి

ప్రజాధనంతో ఏర్పాటు చేసిన ఇంకుడు గుంత ప్రస్తుతం కనిపించడంలేదని, దాని ఆచూకీపై విచారణ జరిపి వాస్తవాలను వెల్లడించాలని కోరుతూ మీర్జాలగూడ డివిజన్ పరిధిలోని చిన్మయ మార్గ్ కాలనీకి చెందిన జంగాల శ్రీరామ్ యాదవ్ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.
సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్, మల్కాజిగిరి మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డికి శ్రీరామ్ యాదవ్ వినతిపత్రం అందజేశారు.

ఇదే అంశంపై మల్కాజిగిరి పోలీస్ స్టేషన్‌లోనూ ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. కాలనీలో వర్షపు నీరు వృథాగా బయటకు వెళ్లకుండా భూమిలోకి ఇంకేలా గతంలో ఇంకుడు గుంతను ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. వర్షపు నీటి సంరక్షణతో పాటు భూగర్భ జలాలను పెంపొందించేందుకు ఈ నిర్మాణం ఉపయోగపడేదని తెలిపారు.

Also Read : ప్రణయ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో వరల్డ్ హార్ట్ డే.. 5కె రన్ విజయవంతం..!

అయితే ప్రస్తుతం ఆ ఇంకుడు గుంత కనిపించకపోవడంతో దాని ఆచూకీపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. ప్రజాధనంతో ఏర్పాటు చేసిన ఇంకుడు గుంత ప్రస్తుతం ఎందుకు కనిపించడం లేదో అధికారులు పరిశీలించాలని కోరారు. దానిని తొలగించినా, తరలించినా అందుకు సంబంధించిన వివరాలను వెల్లడించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో ఇంకుడు గుంత ఏర్పాటు చేసిన ప్రదేశాన్ని గుర్తించి, నిర్మాణం కనిపించకుండా పోవడానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరపాలని కోరారు.

అదే ప్రాంతంలో తిరిగి ఇంకుడు గుంతను ఏర్పాటు చేసి వర్షపు నీటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని శ్రీరామ్ యాదవ్ అధికారులను కోరారు. భవిష్యత్‌లో కాలనీలో నీటి సమస్య తలెత్తకుండా భూగర్భ జలాల పెంపునకు అవసరమైన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు