Miryalaguda : జర్నలిస్టుల హెల్త్ కార్డుల సాధనకై TUWJ -143 ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం వద్ద పోస్ట్ కార్డుల ఉద్యమం..!
జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం టి యు డబ్ల్యూ జే - 143 యూనియన్ ఆధ్వర్యంలో పోరాట కార్యక్రమాలు చేపట్టారు.

Miryalaguda : జర్నలిస్టుల హెల్త్ కార్డుల సాధనకై TUWJ -143 ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం వద్ద పోస్ట్ కార్డుల ఉద్యమం..!
మిర్యాలగూడ, మన సాక్షి :
జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం టి యు డబ్ల్యూ జే – 143 యూనియన్ ఆధ్వర్యంలో పోరాట కార్యక్రమాలు చేపట్టారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ, ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్ ఆదేశాల మేరకు నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జర్నలిస్టుల హెల్త్ కార్డుల సాధనకై పోస్ట్ కార్డుల ఉద్యమం చేపట్టారు. గాంధీ జయంతి సందర్భంగా సాగర్ రోడ్డులోని గాంధీ విగ్రహం వద్ద జర్నలిస్టులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖలు రాస్తూ నిరసన తెలిపారు.
జర్నలిస్టులందరికీ ఉచిత హెల్త్ కార్డులు అందజేయాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు అన్న బోయిన మట్టయ్య, జిల్లా వర్కింగ్ సెక్రెటరీ మల్లె నాగిరెడ్డి, జిల్లా నాయకులు విరగని లక్ష్మణ్, బొంగరాల మట్టయ్య, నియోజకవర్గ అధ్యక్షులు జంగా లక్ష్మణ్ యాదవ్, యూనియన్ నాయకులు కందుకూరి సుదర్శన్, మంద లక్ష్మణ్ , బీసీ సంఘం రాష్ట్ర నాయకులు బెల్లంకొండ దుర్గయ్య, బంటు వెంకటేశ్వర్లు ముదిరాజ్, రాజు తదితరులు పాల్గొన్నారు.











