Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలునల్గొండ

తీదేడులో విబిజి రాంజీ పై ప్రత్యేక గ్రామ సభ..!

మహాత్మా గాంధీజీ ఆశయాలైన సత్యం, అహింస, శాంతి, సమానత్వం, గ్రామ స్వరాజ్యం ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలవాలని తీదేడు గ్రామ సర్పంచ్ ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి అన్నారు.

తీదేడులో విబిజి రాంజీ పై ప్రత్యేక గ్రామ సభ..!

చింతపల్లి, మనసాక్షి.

మహాత్మా గాంధీజీ ఆశయాలైన సత్యం, అహింస, శాంతి, సమానత్వం, గ్రామ స్వరాజ్యం ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలవాలని తీదేడు గ్రామ సర్పంచ్ ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం తీదేడు గ్రామంలో శుక్రవారం మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ‌ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… గ్రామ అభివృద్ధే దేశాభివృద్ధికి పునాది అని, ప్రతి గ్రామం స్వయం సమృద్ధి సాధించినప్పుడే గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాకారమవుతుందని పేర్కొన్నారు.

అనంతరం నిర్వహించిన వి బి జి రాంజీ ప్రత్యేక గ్రామ సభలో ఆమె మాట్లాడుతూ, గ్రామ అభివృద్ధి అనేది కేవలం ప్రజా ప్రతినిధుల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి గ్రామస్తుడి భాగస్వామ్యంతోనే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. గ్రామంలో ఉపాధి అవకాశాల కల్పన, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పారిశుద్ధ్యం, పచ్చదనం, ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతామని తెలిపారు.

మన గ్రామం – మన బాధ్యత, మన అభివృద్ధి – మనందరి లక్ష్యం అనే స్ఫూర్తితో గ్రామస్తులందరూ ఐకమత్యంగా ఉంటూ, గ్రామ సభల్లో చురుకుగా పాల్గొని, గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గాంధీజీ చూపిన సత్యం, అహింస మార్గంలో పయనిస్తూ, ప్రజల సహకారంతో తీదేడు గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే తమ లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి కిరణ్ కుమార్,వార్డు సభ్యులు బొడ్డు పార్వతమ్మ యాదగిరి, మాదగోని కృష్ణ గౌడ్, దాసరి కళమ్మ ముత్తయ్య, రెడ్డి పద్మ పరమేష్, సందె లక్ష్మయ్య, శివర్ల పర్వతాలు యాదవ్, ప్రజాప్రతినిధులు, పంచాయతీ సిబ్బంది గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు