చోరీ కేసులో ఒకరి అరెస్టు..!
మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలంలో ఇటీవల జరిగిన చోరీ కేసులో పోలీసులు ఒకరిని అరెస్టు చేశారు.

చోరీ కేసులో ఒకరి అరెస్టు..!
మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి, మనసాక్షి :
మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలంలో ఇటీవల జరిగిన చోరీ కేసులో పోలీసులు ఒకరిని అరెస్టు చేశారు. నవాబుపేట ఎస్సై నరేందర్ తెలిపిన వివరాల ప్రకారం..
నవాబ్ పేట పరిధికి లోని కూచూరు గ్రామానికి చెందిన గడ్డం శంకరయ్య ఇంట్లో నగలు చోరిపై సెప్టెంబర్ 26న కేసు నమోదు అయింది ఈ దొంగతనం కేసులో నిందితుడు అదే గ్రామానికి చెందిన పరమటి కుమార్, వయస్సు (26) గుర్తించారు. సోమవారం యన్మంగండ్ల గేటు దగ్గర వాహనాలు తనిఖీ నిర్వహిస్తుండగా నిందితుడు పోలీసు చూసి పారిపోతున్నాడు. అతని వెంబడించి పట్టుకొని విచారించగా నేరస్థుడు తాను చేసిన నేరాన్ని దొంగతనాలు ఒప్పుకోవడం జరిగింది.
నిందితుని నుంచి ఒక బంగారు ముక్కు పోగు, స్వాధీనం చేసుకొని, మిగిలిన ఆభరణాలను మహబూబ్ నగర్ లోని మునపురం గోల్డ్ లోన్ లో తాకట్టు పెట్టినా నని చెప్పగా అంతటా పై మునపురంగోల్డ్ లోన్ నుంచి పై తాకట్టు పెట్టిన బంగారు, ఆభరణాలను అనగా రెండు జతల చెవి కమ్మలు, ఒకజత మాట్నిలు, స్వాధీనం చేసుకొని నిందితుడిని అరెస్టు చేసి జిల్లా కోర్టులో హాజరు జరిగిందని తెలిపారు.









