Breaking NewsTOP STORIESఆంధ్రప్రదేశ్వ్యవసాయం
మదనపల్లె మార్కెట్ లో టమాటా ధర పతనం.. రైతుల్లో ఆందోళన..!
అన్నమయ్య జిల్లా మదనపల్లె వ్యవసాయ మార్కెట్ యార్డులో టమాటా ధరలు పతనమవుతున్నాయి.

మదనపల్లె మార్కెట్ లో టమాటా ధర పతనం.. రైతుల్లో ఆందోళన..!
మదనపల్లె, మనసాక్షి
అన్నమయ్య జిల్లా మదనపల్లె వ్యవసాయ మార్కెట్ యార్డులో టమాటా ధరలు పతనమవుతున్నాయి. గురువారం 10 కిలోల 1వ గ్రేడ్ కనిష్టంగా రూ.210, గరిష్టంగా రూ.260 చొప్పున వ్యాపారులు కొనుగోలు చేశారు. మోడల్ ధర రూ.240గా నమోదైంది. 2వ గ్రేడ్ కనిష్టం రూ.120, గరిష్టం రూ.200, మోడల్ ధర రూ.160గా పలికింది. మొత్తం 96 మెట్రిక్ టన్నుల టమాటా మార్కెట్ యార్డుకు వచ్చింది.
దిగుబడి పెరగడం, డిమాండ్ తగ్గడంతో ధరలు తగ్గుతున్నాయని సమాచారం.









