Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రీడలుజిల్లా వార్తలునల్గొండ

Miryalaguda : మిర్యాలగూడలో దసరా పండగ సందర్భంగా వాలీబాల్ టోర్నమెంట్..!

దసరా పండగ సందర్భంగా బి ఎల్ ఆర్ బ్రదర్స్ ఆధ్వర్యంలో ఉమెన్స్ అండ్ మెన్స్ వాలీబాల్ టోర్నమెంట్ 2026 ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ఓపెన్ టు ఆల్ నిర్వహించనున్నారు.

Miryalaguda : మిర్యాలగూడలో దసరా పండగ సందర్భంగా వాలీబాల్ టోర్నమెంట్..!

మిర్యాలగూడ, మన సాక్షి :

దసరా పండగ సందర్భంగా బి ఎల్ ఆర్ బ్రదర్స్ ఆధ్వర్యంలో ఉమెన్స్ అండ్ మెన్స్ వాలీబాల్ టోర్నమెంట్ 2026 ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ఓపెన్ టు ఆల్ నిర్వహించనున్నారు.

ఆదివారం వాలీబాల్ కి సంబంధించిన కర పత్రాన్ని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, మాజీ పట్టణ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి, కౌన్సిలర్ లు ఆడోత్ అశోక్, దైద సోమ సుందర్, బూడిద సైదులు, మాజీ కౌన్సిలర్ లు మంత్రాల రుణాల రెడ్డి, కొమ్ము శ్రీనివాస్ ఆవిష్కరణ చేశారు.

ఈ పోటీలలో మెన్స్ మొదటి బహుమతి 30 వేల రూపాయలు, రెండో బహుమతి 25 వేల రూపాయలు, మూడో బహుమతి 20వేల రూపాయలు, నాలుగో బహుమతి 15వేల రూపాయలు, ఉమెన్స్ మొదటి బహుమతి 20000 రూపాయలు, రెండో బహుమతి 15వేల రూపాయలు అందజేయనున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉమ్మడి నల్గొండ జిల్లాలో అందరు ప్లేయర్స్ గవర్నమెంట్ లో పాల్గొనాలని చెప్పడం జరిగింది.

మరిన్ని వార్తలు