Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంసూర్యాపేట జిల్లా

పట్టభద్రులు ఓటుతో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి

ఖమ్మం–వరంగల్–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన పట్టభద్రులందరినీ ఓటర్లుగా నమోదు చేయించాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

పట్టభద్రులు ఓటుతో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి

• మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్

మన సాక్షి,చిలుకూరు :

ఖమ్మం–వరంగల్–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన పట్టభద్రులందరినీ ఓటర్లుగా నమోదు చేయించాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆదివారం చిలుకూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఓటరు నమోదు అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా… మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని విమర్శించారు. నిరుద్యోగం, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, విద్యారంగ సమస్యలపై పట్టభద్రులు తమ గళాన్ని వినిపించాలని అన్నారు. అర్హులైన విద్యావంతులు, ఉద్యోగులు, నిరుద్యోగులు ఎమ్మెల్సీ ఓటర్లుగా నమోదు చేసుకోవాలని సూచించారు.

పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామాలు, వార్డుల వారీగా పర్యటించి అర్హులైన పట్టభద్రులను గుర్తించాలని, ఓటరు నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని కోరారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి విజయానికి సమన్వయంతో కృషి చేయాలని, కోదాడ నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీ సాధించే లక్ష్యంతో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు