Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రీడలుజిల్లా వార్తలునల్గొండ

మిర్యాలగూడలో బిఎల్ఆర్ కప్ గ్రామీణ స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం..!

మిర్యాలగూడ పట్టణంలోని ఎన్ ఎస్ పి క్యాంప్ గ్రౌండ్‌లో దసరా పండుగ సందర్భంగా టీం సిబికే ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎమ్మెల్యే బిఎల్ఆర్ కప్ ఉమ్మడి నల్గొండ జిల్లా గ్రామీణ స్థాయి కబడ్డీ పోటీలను మున్సిపల్ చైర్‌పర్సన్ చిలుకూరి సుధా బాలకృష్ణ, బత్తుల సాయి ప్రసన్న రెడ్డి ప్రారంభించారు.

మిర్యాలగూడలో బిఎల్ఆర్ కప్ గ్రామీణ స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం..!

మిర్యాలగూడ, మన సాక్షి :

మిర్యాలగూడ పట్టణంలోని ఎన్ ఎస్ పి క్యాంప్ గ్రౌండ్‌లో దసరా పండుగ సందర్భంగా టీం సిబికే ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎమ్మెల్యే బిఎల్ఆర్ కప్ ఉమ్మడి నల్గొండ జిల్లా గ్రామీణ స్థాయి కబడ్డీ పోటీలను మున్సిపల్ చైర్‌పర్సన్ చిలుకూరి సుధా బాలకృష్ణ, బత్తుల సాయి ప్రసన్న రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా క్రీడాకారులను ఉత్సాహపరుస్తూ గ్రామీణ ప్రాంతాల్లోని యువతలో క్రీడా ప్రతిభను వెలికితీయడానికి, క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించడానికి ఇటువంటి పోటీలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. కబడ్డీ వంటి సంప్రదాయ క్రీడలు యువతలో శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, జట్టుస్ఫూర్తి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని తెలిపారు.

ఉమ్మడి నల్గొండ జిల్లా గ్రామీణ స్థాయి క్రీడాకారులకు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు మంచి వేదికగా నిలుస్తున్న ఈ పోటీలను విజయవంతం చేయాలని నిర్వాహకులు, క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో డిసిసి కార్యదర్శి చిలుకూరి బాలు, కిసాన్ జిల్లా అధ్యక్షులు ముదిరెడ్డి నర్సిరెడ్డి, మాజీ పట్టణ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి, నాయకులు గాయం ఉపేందర్ రెడ్డి, దేశిడి శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు