Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఆంధ్రప్రదేశ్క్రైం

మదనపల్లెలో రైతు దారుణ హత్య..!

అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం కొత్తవారిపల్లె పంచాయతీ గాజులవారిపల్లెకు చెందిన రైతు సి. సహదేవ (45) దారుణ హత్యకు గురయ్యాడు.

మదనపల్లెలో రైతు దారుణ హత్య..!

మదనపల్లె, మనసాక్షి:

అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం కొత్తవారిపల్లె పంచాయతీ గాజులవారిపల్లెకు చెందిన రైతు సి. సహదేవ (45) దారుణ హత్యకు గురయ్యాడు. మంగళవారం రాత్రి వ్యవసాయ పనులు ముగించుకుని ఇంటికి వస్తుండగా ప్రత్యర్థులు బండరాళ్లతో కొట్టి హత్య చేసి పరారైనట్లు కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.

రక్తపు మడుగులో పడి ఉన్న ఆయనను కుటుంబీకులు మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. సహదేవ మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు