ఆర్టీఐ చట్టం అమలులో రాష్ట్రస్థాయిలో ఉత్తమ జిల్లాగా సూర్యాపేటకు గుర్తింపు..!
సమాచార హక్కు చట్టం (RTI Act, 2005) అమలులో సూర్యాపేట జిల్లాకు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ పనితీరు కనబరిచిన జిల్లాగా రవీంద్రభారతి లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా చేతులమీదుగా అవార్డు అందుకున్న సందర్భంగా జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ని జిల్లా ఎస్పీ కె. నరసింహ, బుధవారం కలక్టర్ కార్యాలయం నందు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు.

ఆర్టీఐ చట్టం అమలులో రాష్ట్రస్థాయిలో ఉత్తమ జిల్లాగా సూర్యాపేటకు గుర్తింపు..!
సూర్యాపేట, మనసాక్షి :
సమాచార హక్కు చట్టం (RTI Act, 2005) అమలులో సూర్యాపేట జిల్లాకు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ పనితీరు కనబరిచిన జిల్లాగా రవీంద్రభారతి లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా చేతులమీదుగా అవార్డు అందుకున్న సందర్భంగా జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ని జిల్లా ఎస్పీ కె. నరసింహ, బుధవారం కలక్టర్ కార్యాలయం నందు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించడంతో పాటు సమాచార హక్కు చట్టం అమలులో జిల్లా యంత్రాంగం కనబరిచిన పనితీరుకు రాష్ట్రస్థాయిలో గుర్తింపు లభించడం అభినందనీయమని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ నాయకత్వంలో సూర్యాపేట జిల్లాను రాష్ట్రంలో అగ్రగామిగా నిలిపి, జిల్లాకు మంచి పేరు తీసుకువచ్చినందుకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
ప్రజలకు మెరుగైన ప్రభుత్వ సేవలు అందించడం, ప్రభుత్వ శాఖల పనితీరులో పారదర్శకతను పెంపొందించడం, ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారం చూపడం వంటి అంశాల్లో జిల్లా యంత్రాంగం చేస్తున్న కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధి, ప్రజా సంక్షేమం, సమర్థవంతమైన పరిపాలనలో జిల్లా యంత్రాంగం మరిన్ని విజయాలు సాధించాలని ఎస్పీ ఆకాంక్షించారు.