Breaking Newsక్రైంజాతీయం
బ్లూ డ్రమ్ హత్య కేసులో సంచలన తీర్పు.. ఇద్దరు నిందితులకు మరణశిక్ష..!
బ్లూ డ్రమ్ హత్య కేసులో సంచలన తీర్పు వెలువడింది. ఇద్దరు నిందితులకు మరణశిక్ష వేధిస్తూ కోర్టు కీలక తీర్పు విలువరించింది.

బ్లూ డ్రమ్ హత్య కేసులో సంచలన తీర్పు.. ఇద్దరు నిందితులకు మరణశిక్ష..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
బ్లూ డ్రమ్ హత్య కేసులో సంచలన తీర్పు వెలువడింది. ఇద్దరు నిందితులకు మరణశిక్ష వేధిస్తూ కోర్టు కీలక తీర్పు విలువరించింది. దేశవ్యాప్తంగా కలకలం రేపిన మీరట్ బ్లూడ్రమ్ హత్య కేసులో ఈ తీర్పు వెలువడింది. భర్త సౌరబ్ ను హత్య చేసిన కేసులో భార్య ముస్కాన్ రాస్తోగి ఆమె ప్రియుడు సాహిల్ కు మరణశిక్ష విధించింది. మార్చి 2025 మూడవ తేదీన సౌరబ్ కు మత్తుమందు ఇచ్చి అనంతరం కత్తితో హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత మృతదేహాన్ని ముక్కలుగా చేసి శరీర భాగాలను బ్లూ డ్రంలో ఉంచి కాంక్రీట్ తో నింపినట్లు ఈ కేసు విషయంలో వెల్లడయింది. దాంతో అతడి భార్య ఆమె ప్రియుడికి మరణశిక్ష విధించింది.









