Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలునల్గొండసంక్షేమం

Miryalaguda : మిర్యాలగూడలో కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ

వేములపల్లి, మాడ్గులపల్లి మండలాలకు చెందిన 60 మంది లబ్ధిదారులకు రూ.60,06,960 విలువైన కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి పంపిణీ చేశారు.

Miryalaguda : మిర్యాలగూడలో కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ

మిర్యాలగూడ, మన సాక్షి :

వేములపల్లి, మాడ్గులపల్లి మండలాలకు చెందిన 60 మంది లబ్ధిదారులకు రూ.60,06,960 విలువైన కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి పంపిణీ చేశారు.

శనివారం మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దసరా పండుగ సందర్భంగా పుట్టింటికి వచ్చే ఆడబిడ్డలకు కానుకగా కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల చెక్కులను విడుదల చేయడం సంతోషకరమని పేర్కొన్నారు.

పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు, ఆడబిడ్డల వివాహాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని తెలిపారు. మిర్యాలగూడ నియోజకవర్గానికి సంబంధించి దాదాపు 500 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు మంజూరయ్యాయని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని, పేద ప్రజలకు అండగా నిలుస్తూ వారి కుటుంబాల్లో ఆనందాన్ని నింపేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.

మరిన్ని వార్తలు