Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsతెలంగాణపండుగలు

ఎర్రవెల్లి నివాసంలో ఘనంగా కేసీఆర్ దసరా వేడుకలు..!

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి ఎర్రవెల్లి నివాసంలో మంగళవారం దసరా వేడుకలు ఘనంగా జరిగాయి.

ఎర్రవెల్లి నివాసంలో ఘనంగా కేసీఆర్ దసరా వేడుకలు..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి ఎర్రవెల్లి నివాసంలో మంగళవారం దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. వేద పండితుల సమక్షంలో కేసీఆర్ సాంప్రదాయ పద్ధతిలో వాహన పూజ, ఆయుధపూజ నిర్వహించారు.

కుటుంబ సభ్యులు, ఇతర పార్టీ నేతలు పాల్గొనగా శమీ వృక్షానికి పూజ నిర్వహించిన కేసీఆర్ కార్యక్రమంలో పాల్గొన్న వారికి దసరా శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు.

ఎర్రవెల్లిలో నిర్వహించిన దసరా వేడుకల్లో… కేసీఆర్ ధర్మపత్ని శోభమ్మ , కుమారుడు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కోడలు శైలిమ, మనుమడు కల్వకుంట్ల హిమాన్షు రావు తదితర కుటుంబ సభ్యులతో పాటు.. మాజీ హోం మంత్రి మహమ్మద్ మెహమూద్ అలీ, జహంగీర్ తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు