Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుమహబూబ్‌నగర్

Mahabubnagar : పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం.. జిల్లా ఎస్పీ జానకి..!

అమరవీరుల కుటుంబాల త్యాగాలను ఎప్పటికీ మరువకూడదు జిల్లా ఎస్పీ అన్నారు. పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ మహబూబ్‌నగర్‌లో స్మారక ర్యాలీ పోలీసు అమరవీరుల స్మారక దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలోని కవాతు మైదానంలో స్మృతి పరేడ్ నిర్వహించారు.

Mahabubnagar : పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం.. జిల్లా ఎస్పీ జానకి..!

(మహబూబ్ నగర్ – గోపాల్,
మనసాక్షి జిల్లా ప్రతినిధి )

అమరవీరుల కుటుంబాల త్యాగాలను ఎప్పటికీ మరువకూడదు జిల్లా ఎస్పీ అన్నారు. పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ మహబూబ్‌నగర్‌లో స్మారక ర్యాలీ
పోలీసు అమరవీరుల స్మారక దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలోని కవాతు మైదానంలో స్మృతి పరేడ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ డి.జానకి, ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరై పోలీసు అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ సందేశాన్ని అందించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న దేశవ్యాప్తంగా పోలీసు అమరవీరుల స్మారక దినోత్సవాన్ని నిర్వహిస్తూదేశ భద్రత, ప్రజల రక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు వీరుల త్యాగాలను స్మరించుకుంటామని తెలిపారు. 1959 అక్టోబర్ 21న లడఖ్‌లోని హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో చైనా సైనికుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు సిబ్బంది త్యాగాలకు గుర్తుగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.

తెలంగాణ పోలీస్ శాఖ శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, మహిళలు మరియు చిన్నారుల భద్రత, ట్రాఫిక్ నియంత్రణతో పాటు ప్రజల ప్రాణాలను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు.విధి నిర్వహణలో పోలీసులు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ, కుటుంబాలకు దూరంగా ఉంటూ ప్రజల భద్రత కోసం నిరంతరం పనిచేస్తారని, అవసరమైన సందర్భాల్లో ప్రాణాలను సైతం త్యాగం చేస్తారని పేర్కొన్నారు.

Also Read :  Police Station : పోలీస్ స్టేషన్ లో భారీ పేలుడు.. నలుగురు పోలీసులకు తీవ్ర గాయాలు..!

పోలీసు అమరవీరుల త్యాగం వెలకట్టలేనిదని, వారి ధైర్యసాహసాలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని ఎస్పీ అన్నారు. అమరవీరుల కుటుంబాలు చేసిన త్యాగాలను కూడా సమాజం ఎప్పటికీ మరచిపోకూడదని తెలిపారు. వారి త్యాగాలు భావితరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొంటూ, అమరులైన ప్రతి పోలీసు వీరునికి హృదయపూర్వక నివాళులర్పించారు.

అనంతరం అక్కడి నుంచి జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం నుంచి క్లాక్ టవర్, రామ్ మందిర్ చౌరస్తా, లైబ్రరీ మీదుగా మహబూబ్‌నగర్ పట్టణ కేంద్రంలో పోలీస్ స్టేషన్ పరిధిలోని పరదేశి నాయుడు సర్కిల్ వరకు అమరవీరుల స్మారక ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం పరదేశి నాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ నినాదాలు చేశారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఏ ఆర్, సురేష్ కుమార్, జైలు సూపరింటెండెంట్, కాళిదాస్, డి.ఎస్.పి, వెంకటేశ్వర్లు, డి సి ఆర్ బి, డి.ఎస్.పి, రమణా రెడ్డి, ఇంటిలిజెన్స్ డి.ఎస్.పి ఆనంద్, ఇన్స్పెక్టర్లు ఆర్ లు,పోలీసు అమరవీరుల కుటుంబ సభ్యులు, పాల్గొన్నారు..

మరిన్ని వార్తలు