Breaking Newsక్రైంజిల్లా వార్తలునల్గొండ
నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి..!
నల్గొండ జిల్లా చిట్యాల - భువనగిరి రోడ్డు లో జరిగిన రోడ్డు ప్రమాదం లో వ్యక్తి మృతి చెందాడు.

నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి..!
(చిట్యాల – రాకేష్, మనసాక్షి )
నల్గొండ జిల్లా చిట్యాల – భువనగిరి రోడ్డు లో జరిగిన రోడ్డు ప్రమాదం లో వ్యక్తి మృతి చెందాడు. కనకదుర్గ అమ్మవారి గుడి ముందర పాల మల్లయ్య (65) రోడ్డు దాటుతున్న క్రమంలో భువనగిరి వైపు వెళ్తున్న లారీ ఆ వ్యక్తి తలపై నుంచి ఎక్కించగా తల పగిలి అక్కడికక్కడే మృతి చెందినాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.








