Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలునల్గొండపండుగలు

వైభవంగా దుర్గామాత శోభాయాత్ర.. పాల్గొన్న భక్తజనం..!

విజయదశమి సందర్భంగా దేవి శరన్నవరాత్రులు అమ్మవారికి భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి గురువారం శోభాయాత్రకు అమ్మవారిని భక్తజన సందోహంతో ఊరేగిస్తూ శోభ యాత్రకు తరలించారు.

వైభవంగా దుర్గామాత శోభాయాత్ర.. పాల్గొన్న భక్తజనం..!

(చింతపల్లి – వెంకట్, మన సాక్షి )

విజయదశమి సందర్భంగా చింతపల్లి మండలం తీదేడ్ లో దేవీ శరన్నవరాత్రులు అమ్మవారికి భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి గురువారం శోభాయాత్రకు అమ్మవారిని భక్తజన సందోహంతో ఊరేగిస్తూ శోభ యాత్రకు తరలించారు. ఈ సందర్భంగా తీదేడు గ్రామ సర్పంచ్ ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం లో పాల్గొని భక్తులను ఉద్దేశించి మాట్లాడారు.

అమ్మవారిని దర్శించుకునేందుకు గ్రామ ప్రజలు,భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం అన్నారు.భక్తుల జయజయధ్వానాలు, మంగళవాయిద్యాల నడుమ శోభాయాత్ర ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపిందన్నారు.దుర్గామాత ఆశీస్సులతో గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. అమ్మవారి కృపతో గ్రామంలో శాంతి, ఐకమత్యం, అభివృద్ధి వెల్లివిరియాలని కోరుకున్నారు.

Also Read : ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు భవాని భక్తులు మృతి..!

దసరా పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అని, అమ్మవారి ఆరాధన భక్తి, ధైర్యం, ధర్మం పట్ల నమ్మకాన్ని పెంపొందిస్తుందని తెలిపారు. గ్రామ ప్రజలందరూ ఐకమత్యంతో పండుగలను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, గ్రామ ప్రజలు, మహిళలు యువకులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు