Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణసంగారెడ్డి జిల్లా
వావిలాలలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం మున్సిపాలిటీ పరిధిలోని వావిలాల గ్రామ శివారులో ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది.

వావిలాలలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం
పటాన్చెరు, అక్టోబర్ 22/(మనసాక్షి) :
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం మున్సిపాలిటీ పరిధిలోని వావిలాల గ్రామ శివారులో ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. మృతురాలి వయసు 35-45 ఉంటుందని పోలీసులు గుర్తించారు. వేరే ప్రాంతంలో హత్య చేసి మృతదేహాన్ని తీసుకొచ్చి ఇక్కడ పడేసి ఉంటారని భావిస్తున్నారు. మృతురాలి మెడపై కత్తితో దాడి చేసినట్లు ఆనవాళ్ళు ఉన్నాయి. మృతదేహాన్ని ఎవరైనా గుర్తు పడితే జిన్నారం పోలీసులకు తెలపాలని కోరారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు..









