Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలురంగారెడ్డి

ఆమనగల్లులో విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి, ముగ్గురికి గాయాలు

రెండు ద్విచక్ర వాహనాలు ఎదు రెదురుగా ఢీ కొన్న ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా మరో ముగ్గురు గాయపడ్డారు.ఈ ఘటన గురువారం ఆమనగల్లు మండల పరిధిలోని చింతల పల్లి ఖానాపూర్‌ గ్రామాల మధ్య రహదారిపై చోటు చేసుకుంది.

ఆమనగల్లులో విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి, ముగ్గురికి గాయాలు

(ఆమనగల్లు – ఇమ్రాన్, మన సాక్షి )

రెండు ద్విచక్ర వాహనాలు ఎదు రెదురుగా ఢీ కొన్న ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా మరో ముగ్గురు గాయపడ్డారు.ఈ ఘటన గురువారం ఆమనగల్లు మండల పరిధిలోని చింతల పల్లి ఖానాపూర్‌ గ్రామాల మధ్య రహదారిపై చోటు చేసుకుంది.

పోలీసుల వివరాల ప్రకారం తలకొండ పల్లి మండల పరిధిలోని వెంకటా పూర్ తండాకు చెందిన సబావత్ తరుణ్ (17) మైసిగండి నుంచి తన స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న మరో ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్నాడు.ఈ ప్రమాదంలో తరుణ్ మృతి చెందాడు.

Also Read : వావిలాలలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం

అతడి వాహనంపై వెనుక కూర్చున్న తలకొండ పల్లి మండల పరిధిలోని ఆర్లకుంట తండాకు చెందిన నెనావత్ బిచ్యా (40)తో పాటు ఎదురుగా వచ్చిన వాహనంపై ఉన్న చౌడర్‌ పల్లి గ్రామానికి చెందిన శివ, చందు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వెల్దండలోని యన్నం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.

మరిన్ని వార్తలు