Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలునల్గొండ

Miryalaguda : మిర్యాలగూడలో అండర్ పాస్ ల నిర్మాణానికి పరిపాలన అనుమతులు..!

మిర్యాలగూడ పట్టణంలో అద్దంకి - నార్కట్ పల్లి రహదారిపై రెండు చోట్ల అండర్ పాస్ ల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చింది.

Miryalaguda : మిర్యాలగూడలో అండర్ పాస్ ల నిర్మాణానికి పరిపాలన అనుమతులు..!

మన సాక్షి, మిర్యాలగూడ :

మిర్యాలగూడ పట్టణంలో అద్దంకి – నార్కట్ పల్లి రహదారిపై రెండు చోట్ల అండర్ పాస్ ల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ జీవో 545 విడుదల చేశారు. మిర్యాలగూడ పట్టణంలోని నందిపాడు జంక్షన్, చింతపల్లి ఎక్స్ రోడ్డు వద్ద ఈ అండర్పాస్ ల నిర్మాణానికి ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చింది. అందుకోసం 37.19 కోట్ల రూపాయలను మంజూరు చేస్తుంది. ఈ మేరకు పరిపాలన అనుమతులు లభించడంతో టెండర్లు పిలవాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించింది.

మరిన్ని వార్తలు