ఎల్ నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు రైతులకు జిల్లా కలెక్టర్ కీలక సూచన..!
సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం లింగంపల్లి గ్రామం లో తనకు ఉన్న రెండు ఎకరాల భూమి లో మునగ వంగ తోటలు సాగు చేస్తున్న బోయపల్లి సరోజ వ్యవసాయ క్షేత్రాన్ని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవర్ శనివారం సందర్శించారు.

ఎల్ నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు రైతులకు జిల్లా కలెక్టర్ కీలక సూచన..!
(సూర్యాపేట – ముత్యంరాజు, మనసాక్షి)
సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం లింగంపల్లి గ్రామం లో తనకు ఉన్న రెండు ఎకరాల భూమి లో మునగ వంగ తోటలు సాగు చేస్తున్న బోయపల్లి సరోజ వ్యవసాయ క్షేత్రాన్ని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవర్ శనివారం సందర్శించారు. ప్రస్తుతం ఎల్ నీనో ప్రభావంతో వనిటి ఏద్దడి ఎదుర్కొంటున్న రైతులు ఆరుతడి పంటలు అయిన కూరగాయలు సాగుచేసి అధిక లాభాలు పొందాలన్నారు.
ప్రభుత్వం ఉద్యాన పంటల సాగుకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, ప్రభుత్వం అందించే రాయుతిలుసద్వినియోగం చేసుకోని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని కోరారు.వంగ, మునగ తోటల సాగు లో ఉన్న లాభ నష్టాలను రైతును అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ద్వారా అందించిన బిందు సేద్యం పరికరాలు ఏవిదంగా పనిచేస్తున్నాయని, ఎరువులు ఎక్కించే విధానం గురించి రైతును అడిగి తెలుసుకున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో కూరగాయలు సాగు చేస్తున్న రైతును కలెక్టర్ అభినందించారు. అనంతరం అలుగునూరు శివారులో సాదు రామకృష్ణ రెడ్డి 14 ఎకరాల విస్తీర్ణం లో సాగు చేస్తున్న ఆయిల్ పామ్ తోటను సందర్శించి సాగు విధానము పరశీలించారు.
ఈ కార్యక్రమం లో కలెక్టర్ వెంట జిల్లా ఉద్యాన శాఖ ఆధికారి తీగల నాగయ్య, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి, తుంగతుర్తి డివిజన్ ఉద్యాన అధికారిణి వి ప్రమిత, మండల వ్యవసాయ అధికారి దివ్య, విస్తరణ అధికారులు ముత్యం రాజు, సుధాకర్ రెడ్డి, రాము, ఆయిల్ ఫెడ్ ఫీల్డ్ ఆఫీసర్ భద్రాచలం, భవిష్య ఆత్మకూరు, తహసీల్దార్ , ఎం పి డి ఓ సత్యనారాయణ రెడ్డి, తదితరులు ఉన్నారు.










