Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలునల్గొండసినిమా

Miryalaguda : సినీ నటుడు మూస అలీఖాన్ కు విజయనందీ పురస్కారం..!

తెలంగాణ తొలి ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనా చారి చేతుల మీదుగా విజయనంది పురస్కారాన్ని మిర్యాలగూడకు చెందిన నటుడు సామాజికవేత్త ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ డాక్టర్ మూసా అలీ ఖాన్ అందుకున్నారు.

Miryalaguda : సినీ నటుడు మూస అలీఖాన్ కు విజయనందీ పురస్కారం..!

మిర్యాలగూడ, మన సాక్షి :

విజయదశమి సందర్భంగా శుక్రవారం సాయంత్రం రవీంద్ర భారతి మెయిన్ హాల్లో అంగరంగ వైభవంగా జరిగిన విజయదశమి విజయనందీ పురస్కారాలు కార్యక్రమం గొల్ల కృష్ణ గారి ఆధ్వర్యంలో తెలంగాణ తొలి ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనా చారి చేతుల మీదుగా విజయనంది పురస్కారాన్ని మిర్యాలగూడకు చెందిన నటుడు సామాజికవేత్త ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ డాక్టర్ మూసా అలీ ఖాన్ అందుకున్నారు.

Also Read : ఎల్ నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు రైతులకు జిల్లా కలెక్టర్ కీలక సూచన..!

కార్యక్రమ నిర్వాహకులు గొల్ల కృష్ణ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో డాక్టర్ మూసా అలీ ఖాన్ విజయనంది పురస్కారాన్ని అందుకోవటం మాకు చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. మాజీ తొలి తెలంగాణ ఎమ్మెల్సీ మధుసూదనాచారి మాట్లాడుతూ ఇటువంటి గొప్ప కార్యక్రమాలు ఎల్లప్పుడూ జరుగుతూ ఉండాలని నూతన కళాకారులను ప్రోత్సహిస్తున్న కళాకారులను గౌరవిస్తున్న కళాపోషకులకు ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేశారు.

డాక్టర్ మూసా అలీ ఖాన్ మాట్లాడుతూ తెలంగాణ తొలి ఎమ్మెల్సీ మధుసూదనాచారి ముఖ్యఅతిథిగా పాల్గొని విజయనంది పురస్కారాన్ని అందించటం చాలా గర్వంగా ఉందని, మాలాంటి కళాకారులను గుర్తించి మా సేవలను గుర్తించి అవార్డులతో బంగారు పతకాలతో శాలువాలతో మెమొంటోలతో సత్కరిస్తున్న నిర్వాహకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

మరిన్ని వార్తలు