Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
క్రైంBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

Nalgonda : కలర్ ల్యాబ్ యజమాని దారుణ హత్య.. ఉలిక్కిపడిన నల్లగొండ..!

Nalgonda : కలర్ ల్యాబ్ యజమాని దారుణ హత్య.. ఉలిక్కిపడిన నల్లగొండ..!

నల్లగొండ, మన సాక్షి :

నల్లగొండ పట్టణంలోని రామగిరి లో ఉన్న శ్రీ మణికంఠ డిజిటల్ కలర్ ల్యాబ్ ఓనర్ గద్దపాటి సురేష్ శుక్రవారం రాత్రి సమయంలో దారుణ హత్యకు గురయ్యాడు. వివరాల ప్రకారం .. హంతకులు సురేష్ ను కత్తితో దారుణంగా విచక్షణ రహితంగా పొడిచి హత్య చేశారు.

గద్దపాటి సురేష్ రాత్రి పది గంటల సమయంలో కలర్ ల్యాబ్ లో తన పనులు చూసుకుంటుండగా ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు మాస్కులు ధరించి కస్టమర్ల వలె వచ్చి ఫోటో ఫ్రేమ్ ల గురించి మాట్లాడుతుండగానే అందులో ఒకడు సురేష్ గుండెపై కత్తి తోపొడవుగా మరొకడు గట్టిగా కదలకుండా పట్టుకున్నట్లు తెలిసింది.

ఆ తర్వాత పెనుగులాటలో హంతకులు సురేష్ శరీరంపై విచక్షణారహితంగా కత్తిపోట్లు పొడవుగా సురేష్ అక్కడికక్కడే మరణించారు. కాగా గద్దపాటిసురేష్ గత ఆరు సంవత్సరాల క్రితం నకరేకల్ నుండి నల్లగొండకు వచ్చి శ్రీ మణికంఠ కలర్ ల్యాబ్ ను నిర్వహిస్తున్నాడు. ఇతని వద్ద సుమారు 25 మంది వర్కర్లు పనిచేస్తున్నట్లు సమాచారం. హంతకులు ఎవరనేది తెలియదు.

హంతకులు పకడ్బందీ ప్రణాళికతోనే హత్యకు పాల్పడినట్లు తెలుస్తుంది. మాస్కులు ధరించి వచ్చిన వారు మణికంఠ కలర్ ల్యాబ్ ముందున్న సీసీ కెమెరాల వైర్లను కత్తిరించినట్లు తెలిసింది. మృతుడు సురేష్ కొన్ని సంవత్సరాలుగా భార్యతో వేరుగా ఉంటున్నట్లు తెలిసింది. కాగా టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని శవాన్ని పోస్టుమార్టం పంపి దర్యాప్తు చేస్తున్నారు.

MOST READ : 

  1. Viral Video : మెట్రో స్టేషన్లో ఇదేం పాడు పని రా బాబు.. (వీడియో వైరల్)

  2. T-20 : క్రికెట్ ప్రియులకు గుడ్ న్యూస్.. రాజీవ్ గాంధీ స్టేడియంలో ఆ.. సేవలు..!

  3. TG News : తెలంగాణలో పెన్షన్ దారులకు భారీ గుడ్ న్యూస్.. ఇకపై పెన్షన్ కోసం నో టెన్షన్..!

  4. TG News : తెలంగాణ రైతులకు భారీ గుడ్ న్యూస్.. మరో నూతన కార్యక్రమం ప్రారంభం..!

  5. Rice : అన్నం ఎక్కువగా తింటున్నారా.. అయితే ఇది తెలుసుకోండి.!

మరిన్ని వార్తలు