Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

District Collector : కుటుంబానికి ఒక డిజిటల్ కార్డు.. సర్వేకై తక్షణమే బృందాలను ఏర్పాటు చేయాలి..!

District Collector : కుటుంబానికి ఒక డిజిటల్ కార్డు.. సర్వేకై తక్షణమే బృందాలను ఏర్పాటు చేయాలి..!

నల్లగొండ, మన సాక్షి:

కుటుంబానికి ఒక డిజిటల్ కార్డు విషయమై ప్రతి మున్సిపల్ వార్డు, గ్రామపంచాయతీ లలో 150 కుటుంబాలకు ఒక బృందాన్ని ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి జిల్లా అధికారులతో ఇదే అంశాలపై సమీక్ష నిర్వహించారు.  ఈనెల 2న ఈ బృందాలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, ఈ శిక్షణ కార్యక్రమానికి ఎంపిక చేసిన సిబ్బంది అందరూ హాజరయ్యేలా చూడాలన్నారు.

ఎట్టి పరిస్థితుల్లో శుక్రవారం వరకు ఈ బృందాలు క్షేత్రస్థాయిలో సర్వేను ప్రారంభించాలని చెప్పారు. ఇందుకుగాను మున్సిపల్ కమిషనర్లు వారి కార్యాలయాలలో కుటుంబ డిజిటల్ కార్డుకు సంబంధించి ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేసి ఆయా బృందాలలో ఉండే సిబ్బంది పేర్లు, వారి ఫోన్ నెంబర్లతో సహా పత్రికల ద్వారా ప్రజలకు తెలియజేయాలన్నారు .రానున్న 15 రోజుల్లో పూర్తిస్థాయిలో కుటుంబ డిజిటల్ కార్డుకు సంబంధించిన పరిశీలన మొత్తం పూర్తి అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ,జిల్లా వ్యాప్తంగా ఈ అంశాన్ని ఆర్డీవోలు సమన్వయం చేయాలని ఆదేశించారు.

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు సంబంధించి ప్రస్తుతం ఆయా నియోజకవర్గాల వారిగా వివరాలను సమర్పించాలని, కొన్ని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పూర్తయ్యాయని, మరికొన్ని పురోగతిలో ఉన్నాయని, రాష్ట్రప్రభుత్వ ఆదేశాల మేరకు దసరా నాటికి లబ్ధిదారులందరినీ గుర్తించి దసరాకు వాటిని లబ్ధిదారులకుఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఎల్ ఆర్ ఏస్ దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని, వాటి పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి. పూర్ణ చంద్ర ,అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, జిల్లా అధికారులు ఈ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు.

MOST READ : 

మరిన్ని వార్తలు