Fake Doctor : నకిలీ వైద్యుడి గుట్టు రట్టు.. క్లినిక్ సీజ్..!
Fake Doctor : నకిలీ వైద్యుడి గుట్టు రట్టు.. క్లినిక్ సీజ్..!
హుజుర్ నగర్, మనసాక్షి :
సూర్యాపేట జిల్లాలో నకిలీ వైద్యుడు ఆటకట్టు అయ్యింది. వైద్యాధికారులు తనిఖీలు చేసి క్లినిక్ ను సీజ్ చేశారు. అర్హత లేకుండా వైద్యం చేస్తే వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యశాఖ అధికారి కోటాచలం అన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలోని రామాపురం గ్రామంలో గత కొంతకాలంగా శోకతాలి ఖాన్, డాక్టర్ గా చలామణి అవుతూ అనుమతి లేని బోర్డుతో ఆసుపత్రి నిర్వహిస్తున్నట్లుగా తెలుసుకొని బుధవారం తనిఖీ చేశారు.
ఎలాంటి ఉన్నతమైన అర్హతలు లేకున్నా అర్హతకు మించి వైద్యం చేస్తున్నాడనే సమాచారంతో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కోటచలం, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం ప్రకారం టీంతో కలిసి తనిఖీ చేశారు. ఎక్కువ మోతాదులో స్టెరాయిడ్స్ వాడుతున్నట్లు గుర్తించి, దాన్ని నిర్ధారించి క్లీనిక్ ని మూసి వేశారు.
ఆర్ఎంపీలు ఎక్కడైనా ఇలాంటి అర్హతకు మించి వైద్యం నిర్వహిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే సహించేది లేదని, వారి పై చట్టరీత్యా కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీలు జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ నాజియా, స్టాటిస్టికల్ ఆఫీసర్ వీరయ్య, డాక్టర్ మౌనిక ఏఎస్ఐ జ్యోతి, సఖి కన్సల్టెంట్ ఎలిశమ్మ, కార్తీక్ తదితర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
MOST READ :
-
Ration Cards : రేషన్ కార్డుల పంపిణీకి డేట్ ఫిక్స్..!
-
Free Sewing Machine : మహిళలకు సూపర్ గుడ్ న్యూస్.. ఉచిత కుట్టుమిషన్లకు దరఖాస్తు ఇలా..!
-
Indiramma Indlu : ఇందిరమ్మ ఇండ్లపై జిల్లా కలెక్టర్ కీలక ప్రకటన.. లేటెస్ట్ అప్డేట్..!
-
Cm Revanth Reddy : 12 ఏళ్లు అద్దె ఇంట్లో గడిపిన రేవంత్ రెడ్డి.. అ ఇంటికి వెళ్లి భావోద్వేగం..!
-
TG News : తెలంగాణలో విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్..!









