Breaking Newsకామారెడ్డి జిల్లాజిల్లా వార్తలుతెలంగాణ
Kamareddy : ఉదృతంగా ప్రవహిస్తున్న వాగు.. ప్రవాహంలో చిక్కిన 30 మంది రైతులు..!

Kamareddy : ఉదృతంగా ప్రవహిస్తున్న వాగు.. ప్రవాహంలో చిక్కిన 30 మంది రైతులు..!
కామారెడ్డి, మన సాక్షి :
తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం పోతంగల్ కుర్దు – నాగులూర్ శివారులోని పొలాల్లో వరి నాట్లు వేయడానికి సుమారు 30 మంది రైతులు వెళ్లారు.
పనులు ముగించుకొని సాయంత్రం ఇళ్లకు చేరడానికి తిరుగు ప్రయాణంలో కాటేవాడి వాగు దాటాల్సి ఉంది. ఆ ప్రాంతంలో ఉన్న వాగును దాటుతుండగా వరద ఉధృతి పెరగడంతో వారంతా వాగులో చిక్కుకున్నారు. సుమారు మూడు గంటల పాటు వరదలోనే ఒకరిని ఒకరు పట్టుకొని గుంపుగా నిరీక్షించారు. వరద తగ్గుముఖం పట్టిన తర్వాత గుంపుగా వాగు దాటారు.
MOST READ :
-
TG News : తెలంగాణ రైతులకు ప్రభుత్వం భారీ శుభవార్త.. ఆ రైతులకు ఎకరానికి రూ.4 వేలు బ్యాంకు ఖాతాలలో జమ..!
-
PMSBY : ఏడాదికి రూ.20 చెల్లిస్తే చాలు.. రూ.2 లక్షల ప్రమాద బీమా వర్తింపు.. మీరు అర్హులేనా..!
-
ACB : ఐదు లక్షల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సబ్ రిజిస్ట్రార్..!
-
Srisailam : నిండుకుండలా శ్రీశైలం.. నాగార్జునసాగర్ కు భారీ వరద..!
-
Fake Certificates : నకిలీ సర్టిఫికెట్ల దందా.. SSC నుంచి BeTech వరకు, ఏదైనా సాద్యమే ఇక్కడ..!
-
District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. మున్సిపల్ ఉద్యోగుల సస్పెన్షన్.. మేనేజర్ కు షోకాజ్..!









