క్రైంBreaking Newsతెలంగాణసంగారెడ్డి జిల్లా

TG News : సిగాచి రసాయన పరిశ్రమలో భారీ పేలుడు.. ఎగిరి పడిన కార్మికులు.. 8 మంది మృతి..!

TG News : సిగాచి రసాయన పరిశ్రమలో భారీ పేలుడు.. ఎగిరి పడిన కార్మికులు.. 8 మంది మృతి..!

మన సాక్షి, హైదరాబాద్ :

సంగారెడ్డి జిల్లా పాశ మైలారంలోని పారిశ్రామిక వాడలో సిగాచి రసాయన పరిశ్రమలో సోమవారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. రియాక్టర్ పేలి ఎనిమిది మంది కార్మికులు మృతి చెందారు. సంఘటన స్థలంలో ఐదుగురు మృతి చెందగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు మృతి చెందారు. పేలుడు దాటికి కార్మికులు 100 మీటర్ల దూరంలో ఎగిరిపడ్డారు.

సంగారెడ్డి జిల్లాలో రసాయన కంపెనీలో పరిశ్రమలో 66 మంది కార్మికులు ఉన్నారు. పేలుడులో 36 మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వారిని వివిధ ఆస్పత్రులకు తరలించారు. సహాయక చర్యలు చేపడుతున్నారు. సహాయక చర్యల్లో ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా, రెవిన్యూ, పోలీసులు ఉన్నారు.

పేలుడు శబ్దంతో కార్మికులు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. పాశ మైలారం పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. మంత్రి దామోదర రాజనర్సింహ పరిశీలించారు. సంఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.

అదేవిధంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోష్ సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు పరిశీలిస్తున్నారు. 11 అగ్నిమాపక వాహనాలతో మంటలను ఆర్పుతున్నారు. ఈ రసాయన పరిశ్రమలో ఒరిస్సా బీహార్ తో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.

MOST READ : 

  1. BREAKING : ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి..!

  2. Srisailam : శ్రీశైలం జలాశయానికి భారీ వరద.. ఎప్పటిలోగా నిండుతుందంటే..!

  3. Benz: ఆకర్షణీయమైన స్పోర్ట్స్‌కార్లు.. ఆవిష్కరించిన మెర్సిడెస్ బెంజ్..!

  4. Gold Price : మరోసారి తగ్గిన బంగారం ధర.. ఈరోజు తులం ఎంతంటే..!

  5. Potato Kurma : స్టార్ హోటల్ టేస్టీ.. ఆలూ కుర్మా చేయడం వెరీ సింపుల్.. అన్నింటిలోకి అదిరిపోద్ది..!

మరిన్ని వార్తలు